Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు రాక్షసుడు, మోడీకి తెలుస్తుందని భయం: జగన్

హైదరాబాద్: రాజధానికి సంబంధించి రైతులకు ఇష్టం లేకపోయినా పచ్చిన భూములను బలవంతంగా తీసుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. రైతులు ఏదో స్థితిలో భూమిని స్వాధీనం చేస్తూ లేఖలు ఇచ్చారని, వాటిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. చంద్రబాబు, మంత్రులు, శాసనసభ్యులు తమ భూములను హైదరాబాదులో గానీ విజయవాడలో గానీ రైతులకు ఇచ్చిన పర్సెంటీజీతో ఇస్తారా అని అడిగారు. మీరు ఇవ్వలేనప్పుడు రైతుల నుంచి ఎందుకు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. భూములు తీసుకున్న రైతులకు 5 శాతం ఇస్తున్నారని, మిగతాదంతా మీరు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఆయన అన్నారు.

హైదరాబాదు విమానాశ్రయం కట్టాలంటే 10 వేల కోట్లు ఖర్చవుతాయని, ఎనిమిదేళ్లు అవుతోందని, ఈ రోజుకు కూడా గజం 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు భూమి దొరుకుతోందని, రాజధాని ఎప్పుడు నిర్మిస్తారు, వారి భూముల రేట్లు ఎప్పుడు పెరుగుతాయని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, చేయాల్సింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని ఆయన అన్నారు. బలవంతంగా భూములు లాక్కోవడం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఆలోచనను మార్చుకోవాలని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలో, వ్యవసాయం చేయాలో ప్రజలు నిర్ణయించుకునే విధంగా ఆచరణ ఉండాలని ఆయన అన్నారు. వినుకొండలో 18 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడ రాజధానిని నిర్మించుకోవచ్చుని, అక్కడ జపాన్ కాకపోతే సింగపూర్‌ను లేదంటే అమెరికాను కట్టాలని ఆయన అన్నారు. చంద్రబాబు రాక్షసుడయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వ తం కాదని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు టిడిపీని బంగాళాఖాతంలో కలుపుతారని, తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు రైతు భూములను వెనక్కి ఇస్తామని కచ్చితంగా చెబుతున్నామని ఆయన అన్నారు.

YS Jagan terms Chandrababu as Rakshasa

విభజన అంశం గురించి శాసనసభలో గొడవ జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 నెలలు గడిచిందని ఆయన అన్నారు. ఈనాటికీ విభజన హామీలు అమలు కాలేదని తెలుగు మీడియాకు చెబుతున్నారని, కానీ చంద్రబాబు జాతీయ మీడియాకు చెప్పడం లేదని ఆయన అన్నారు. జాతీయ మీడియాకు చెప్తే నరేంద్ర మోడీకి తెలిస్తుందని, అలా తెలిస్తే చంద్రబాబుకు నష్టం జరుగుతుందని, అందుకే చెప్పడం లేదని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం కాదా అని ఆయన అడిగారు. కేంద్రంలో ఇద్దరు టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులు, రాష్ట్రంలో బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారని, అయితే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీని కలిసి రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ వచ్చామని, ప్రతి మంత్రినీ కలిశామని ఆయన అన్నారు. తాము కూడా వస్తామని, ఢిల్లీకి వెళ్లి అడుగుదామని ఆయన అన్నారు.

హైదరాబాదులో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. వారికి మహా అయితే 500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 14 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని, అప్పులు చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారని ఆయన చెప్పారు. పది లక్షల మంది పింఛన్లపై కోత పెట్టినట్లు బడ్జెట్ కేటాయింపులే చెబుతున్నాయని ఆయన అన్నారు. పిల్లల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని ఆయన అన్నారు. 7.95 లక్షల ఇళ్లు చంద్రబాబు వచ్చేనాటికి మంజూరయ్యాయని ఆయన చెప్పారు. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగిపోయాయని ఆయన అన్నారు. అన్ని ఇళ్లకూ చెల్లింపులు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదని, ఈ ఏడాది కూడా రాదని ఆయన అన్నారు.

1.37 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారని ఆయన అన్నారు. 35 వేల మంది ఫీల్డ్ ఆసిస్టెంట్లు, ఆదర్శరైతులు ఇవాళ రోడ్డుపై పడ్డారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మైనారిటీలకు, ఎస్సీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎలా అన్యాయం చేస్తుందో వివరించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు మోసం చేశారని, కాపులను బిసీల్లో చేర్చే విషయంలో కూడా అదే చేస్తారని ఆయన అన్నారు. కుల రాజకీయాలు ఆడడంలో చంద్రబాబు నేర్పరి అని ఆయన అన్నారు. ఎస్సీల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు.

ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారని, మార్చినా ఫరవా లేదు గానీ ప్రజలకు న్యాయం చేస్తే మేలు జరుగుతుందని, కానీ ఆ మేలు జరడగడం లేదని ఆయన అన్నారు. దానికి కేటాయింపులు పెరగాల్సి ఉందని ఆని ఆయన అన్నారు. పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని, ఇది అత్యంత దారుణమని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+