కీలక నేతలకు జగన్ పిలుపు - మేనిఫెస్టోలో కీలక హామీలు..!!
ఏపీలో ఎన్నికల యుద్దం కీలక దశకు చేరింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీలో పోటీలో ఉన్న అభ్యర్దుల మార్పులు ప్రకటించారు. మేనిఫెస్టో పైన మూడు పార్టీల టీడీపీ కూటమి కసరత్తు చేస్తోంది. బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టో సిద్దం చేసారు. పార్టీ ముఖ్యులకు జగన్ నుంచి పిలుపు వచ్చింది. మేనిఫెస్టో అంశాల పై వారితో చర్చించిన తరువాత జగన్ తుది నిర్ణయం తీసుకోన్నారు. మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసారు.
సీనియర్లకు పిలుపు
పార్టీ సీనియర్ నేతలను రేపు తన యాత్ర బస వద్దకు రావాలని జగన్ సూచించారు. ఈ నెల 24న శ్రీకాకుళంలో జగన్ బస్సు యాత్ర ముగియనుంది. 25వ తేదీన పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ప్రతీ రోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా జగన్ షెడ్యూల్ సిద్దం అవుతోంది. మే 9వ తేదీ వరకు దాదాపు 100 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక..కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. పార్టీ మఖ్య నేతలతో చర్చించిన తరువాత మేనిఫెస్టో హామీల పైన తుది నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేనిఫెస్టో ప్రకటించనున్నారు.

మేనిఫెస్టో పై నిర్ణయం
బస్సు యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాలతో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. రైతు రుణమాఫీ కోసం జగన్ పైన పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసామని జగన్ ప్రతీ సభలో చెబుతున్నారు. చెసేదే చెబుతామని..చెబితే చేస్తామని జగన్ స్పష్టం చేసారు. గత ఎన్నికల సమయంలో చెప్పిన డ్వాక్రా సంఘాల రుణ మాఫీ అమలు చేసారు. దీంతో..ఈ సారి రైతులు, మహిళల కోసం జగన్ ఏం ప్రకటిస్తారనేది కీలకంగా మారుతోంది.

రుణమాఫీ ఉండేనా
టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. మరిన్ని హామీలతో మేనిఫెస్టో ప్రకటనకు మూడు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తే మరింత మెరుగైన హామీ లతో ముందుకు వెళ్లాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తార..రైతు భరోసా మరింత పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మహిళల కోసం కొత్త నిర్ణయాలు పార్టీ మేనిఫెస్టోలో ఉంటాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ రైతు రుణమాఫీకి అనుకూలంగా నిర్ణయం ఉంటుందనే అంచనాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. దీంతో, రుణమాఫీ పైన జగన్ ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications