విశాఖ కేంద్రంగా జగన్ బిగ్ డెసిషన్ - మావిగన్ ప్రకటనతో..!!
ఏపీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కార్యాచరణ అమలు చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వం పైన గురి పెట్టారు. వరుస విమర్శలతో టార్గెట్ చేస్తున్నారు. అమరావతి - మావిగన్ కేంద్రంగా రాజకీయం పీక్ కు చేరింది. ఈ సమయం లోనే జగన్ విశాఖ కేంద్రంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
మాజీ సీఎం జగన్ మావిగన్ రాజధానిగా చేసిన ప్రకటన రాజకీయంగా కొత్త చర్చకు కారణమైంది. ఎన్నికల మేనిఫెస్టో లోనూ మావిగన్ ప్రకటనతోనే ప్రజల ముందుకు వెళ్తామని జగన్ ప్రకటించారు. అటు కూటమి అమరావతి రాజధానిగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. జగన్ ప్రకటించిన మావిగన్ వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. జగన్ మావిగన్ ప్రకటన తరువాత సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. విశాఖలో తాము ప్రఖ్యాత సంస్థలను తీసుకొస్తున్నామని కూటమి నేత లు చెబుతుంటే .. విశాఖ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రేపు (మంగళవారం) విశాఖ పర్యటనకు వెళ్తున్నారు.

పరామర్శ.. పార్టీ నేతలతో సమావేశం
గతంలో విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని చెప్పిన జగన్.. ఇప్పుడు మావిగన్ పై ప్రకటన తరువాత తొలి సారి విశాఖకు వస్తున్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం తీరంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావటంతో.. వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జబ్బర్ పేటకు వెళ్లి.. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన కారి చిన్నతో పాటు గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు బాటసగా నిలవాలని జగన్ నిర్ణయించారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించగా.. జగన్ వీరి పరామర్శ తరువాత పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. విశాఖ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పార్టీ నేతల సమావేశంలో చర్చించి.. జగన్ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, మావిగన్ ప్రకటన తరువాత విశాఖ లో జగన్ పర్యటనకు వచ్చే స్పందన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications