YS Jagan: కీలక నిర్ణయాలకు సిద్దమైన జగన్- 22, 23 తేదీల్లో ప్రకటనలు..!

ఏపీలో గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓటమిపాలైన తర్వాత భవిష్యత్ రాజకీయంపై జగన్ పూర్తిస్దాయిలో మేథోమథనం చేయలేదు. అదే సమయంలో కూటమి సర్కార్ పాత కేసులతో వైసీపీ నేతల్ని తరుముతుతోంది. అటు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు అండగా నిలవాలా లేక పోరాటం చేయాలా అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు భవిష్యత్ రాజకీయంపై దిశానిర్దేశం చేసేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఇందుకోసం రెండు కీలక భేటీలు నిర్వహించబోతున్నారు.

ఈ నెల 22, 23 తేదీల్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలతో జగన్ భేటీ కాబోతున్నారు. ఇందులో 22వ తేదీన వైసీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఇందులో
తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ చర్చించనున్నారు. అలాగే పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు.

ys jagan to decide ysrcp s future on April 22 23 key meeting with pac and social media teams

మరోవైపు ఈ నెల 23న జిల్లా సోషల్ మీడియా, వైసీపీ అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం అవుతారు. ఇందులో వైసీపీ సోషల్ మీడియా తిరిగి యాక్టివ్ కావడంపై దిశానిర్దేశం చేయబోతున్నారు. అసలే కూటమి సర్కార్ కేసులతో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా డల్ అయిపోయింది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపై సోషల్ టీమ్స్ కు జగన్ దిశానిర్దేశం చేస్తారు. అలాగే జిల్లాల అధ్యక్షులు ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీల ఉల్లంఘనపై జనంలోకి వెళ్లి ఎలా వివరించాలో జగన్ సూచనలు చేయబోతున్నారు.

ys jagan to decide ysrcp s future on April 22 23 key meeting with pac and social media teams

వైసీపీని, ఎంపీ పదవినీ, రాజకీయాల్ని వీడిపోయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన చుట్టూ కోటరీ ఉందంటూ పలుమార్లు చేసిన విమర్శలపై జగన్ ఈ భేటీల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మద్యం కుంభకోణం పేరుతో కూటమి సర్కార్ తమను టార్గెట్ చేస్తున్న తీరుపైనా నేతలకు వివరిస్తారు. దీంతో పాటు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తో వ్యవహరించాల్సిన తీరుపైనా ఎంపీలకు కీలక సూచనలు చేస్తారని తెలుస్తోంది.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+