ఢిల్లీలో జగన్ ఆపరేషన్ అమరావతి - బిగ్ టర్న్..!!

ఎన్నికల్లో ఓడిన జగన్ సమీక్షలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్ పై పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ దాడులు జరిగిన పార్టీ శ్రేణుల పరామర్శ కు జగన్ సిద్దమయ్యారు. కష్టాలు కొత్త కాదని వ్యాఖ్యానించారు. 14 నెలలు పాదయాత్ర చేసానని..ఇంకా వయసు, సత్తా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఎలా వ్యవహరించాలనేది జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఎంపీలతో జగన్ భేటీ
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం అవుతున్నారు. ఓటమి తరువాత పలు జిల్లాలకు చెందిన నేతలు జగన్ తో భేటీ అయ్యారు. ఫలితాల పైన సమీక్ష చేసారు. పోలింగ్ రోజున..ఆ తరువాత దాదాపు 18 లక్షల శాంపిల్స్ తీసుకొని సర్వే చేసామని..అందులో సానుకూల ఫలితాలు వచ్చాయని జగన్ వివరించారు. కానీ, ఫలితం మాత్రం అర్దం కాలేదని వ్యాఖ్యానించారు. ఇక.. ప్రతిపక్షంలో ఉండటం..కష్టాలు కొత్త కాదని చెప్పుకొచ్చారు. అయిదేళ్లు ఓపిక పడితే మరోసారి పార్టీ ఎగిసిన కెరటంలా దూసుకెళ్తుందని భరోసా నింపే ప్రయత్నం చేసారు.

YS Jagan to hold key meet with party MP s to fix road map for role in parliament and with BJP

మారుతున్న లెక్కలు
టీడీపీ కూటమికి శాసన మండలిలో సంఖ్యా పరంగా బలం లేదు. దీంతో, ఎమ్మెల్సీతో సమావేశ సమయంలో జగన్ ఇదే విషయం పైన అప్రమత్తం చేసారు. ప్రలోభాలకు గురి చేస్తారని అలర్ట్ ఇచ్చారు. ఇక, కేంద్రం లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాలు..నెంబర్ గేమ్ వేళ ఎంపీలతోనూ జగన్ సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఏపీలో జరిగిన రాజకీయ దాడుల పైన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఫిర్యాదు చేసారు. 2014-19 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోనూ బీజేపీ చేరింది.

వ్యూహాత్మక వైఖరి
కేంద్రంలో నెంబర్ గేమ్ కీలకంగా మారటంతో...జగన్ అప్రమత్తం అయ్యారు. అదే సమయంలో రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. లోక్ సభలోనూ వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. దీంతో..కేంద్రంతో ఘర్షణ వైఖరి అవసరం లేదని జగన్ భావిస్తున్నారు. బీజేపీ నాయకత్వ ఆలోచనలు..కార్యాచరణ పైన అవగాహన ఉన్న జగన్ ఢిల్లీ కేంద్రంగా సమాయానుకూలంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఏపీలో బలం లేకపోయినా..కేంద్రంలో మాత్రం వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీంతో..పార్టీ ఎంపీల సమావేశంలో జగన్ భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+