జగన్ కీలక నిర్ణయం, ముఖ్య నేతలకు పిలుపు - గవర్నర్ తో భేటీ..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం పైన పోరుబాట తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి నుంచి బస్సు యాత్రకు జగన్ సిద్దమయ్యారు. అందులో భాగంగా ముఖ్య నేతలతో భేటీకి నిర్ణయించారు. ఇదే సమయంలో మెడికల్ కాలేజీల పైన పోరు కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. కాగా.. గవర్నర్ తోనూ భేటీకి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీనిని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం పైన వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాలు సేకరించింది. కాగా.. ఈ నెల 17న జగన్ గవర్నర్ ను సమావేశం కానున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి జగన్.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అపాయింట్‌మెంట్ ఖరారయింది. రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు వినతి పత్రం ఇవ్వనున్నారు.

కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్ గారికి చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. ఇదే సమయంలో ఆ రోజు పార్టీ ముఖ్య నేతలతోనూ జగన్ సమావేశం కానున్నారు. మెడికల్ కాలేజీ ల పైన పోరుబాట కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కార్యాచరణ ఖరారు చేయటం తో పాటుగా జగన్ సైతం నిరసనలో పాల్గొనేలా షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు. ఇక.. జనవరి చివరి వారం నుంచి జగన్ పార్టీ కేడర్ తో సమావేశాల కోసం బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ పర్యటన.. షెడ్యూల్ పైన ముఖ్య నేతల భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నుంచి పూర్తి గా పార్టీకే సమయం కేటాయించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్న పార్టీ నేతలు.. ఈ మేరకు కొత్త కార్యాచరణ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications