జగన్ పాదయాత్ర ఎప్పుడో వెల్లడించిన పేర్ని నాని- రూట్ మ్యాప్ ఇలా
YS Jagan: మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టారు.
ఉమ్మడి గుంటూరు తర్వాత.. తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు. వారికి అండగా నిలిచారు. సంఘీభావాన్ని తెలియజేశారు. మామిడి రైతులు పడుతున్న అష్టకష్టాలను టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ పాదయాత్ర అంశం తెరమీదికి వచ్చింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆ పాదయాత్ర ఎలా ఉండబోతోందో సూచనప్రాయంగా తెలియజేశారు. రూట్ మ్యాప్ గురించి వివరించారు.
మరో రెండు సంవత్సరాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేయబోతోన్నాడని పేర్నినాని తెలిపారు. పాదయాత్రకు బయలుదేరి వెళ్లడానికి ముందు పార్టీ ప్లీనరీని నిర్వహిస్తారని అన్నారు. దీని తర్వాత పాదయాత్ర చేపడతారని చెప్పారు. గతంలో జగన్ నిర్వహించిన పాదయాత్రకు మించిన స్థాయిలో ఇది ఉండబోతోందని పేర్కొన్నారు.
పాదయాత్ర 2.Oలో భాగంగా జగన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ వెళ్తాడని పేర్నినాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపుగా 10,000లకు పైగా పంచాయతీలో ఉన్నాయని, వాటన్నింటికీ జగన్ వెళ్తాడని, ప్రతి ఒక్కడినీ కలుస్తాడని, వారి సాధకబాధకాలను వింటాడని చెప్పారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి గుర్తు పెట్టుకోవాలని పేర్నినాని అన్నారు. తప్పుడు కేసులు పెట్టే సంప్రదాయానికి టీడీపీ కూటమి తెర తీసిందని, దాన్ని అలవాటు చేస్తోందని విమర్శించారు.
2016లో గోదావరి పుష్కరాల్లో ఇదే చంద్రబాబు నాయుడు.. తన భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిసి మునకలు వేయడాన్ని సినిమాగా తీయడానికి ప్రయత్నించారని, అప్పట్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్ని నాని గుర్తు చేశారు.
ఇదే సంప్రదాయాన్ని తాము కొనసాగించితే- జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ చనిపోయిన 30 మంది కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి చంద్రబాబుపై కేసుపెడితే అప్పుడు ఆయన బీఎన్ఎస్ సెక్షన్ 302 కింద చంద్రబాబు ముద్దాయి అవుతాడా? అవ్వడా అని అన్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications