గవర్నర్ తో భేటీ వేళ జగన్ అనూహ్య నిర్ణయం, ముఖ్య నేతలకు పిలుపు..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం పై జగన్ పోరుబాట ప్రారంభించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీనిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటీ సంతకాలు సేకరించింది. ఈ రోజు గవర్నర్ తో జగన్ భేటీ కానున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. జగన్ నిర్ణయం ఇప్పుడు పార్టీ లో ఆసక్తి కరంగా మారింది. కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
మాజీ సీఎం జగన్ ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గవర్నర్‌ను కలిసేందుకు భారీ ర్యాలీతో వెళ్లాలని వైసీపీ నేతలు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంతో లోక్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

లోక్‌భవన్, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలోని లోక్ భవన్ వద్ద ఏ విధమైన ప్రజా ర్యాలీలు, పాదయాత్రలు, ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి, అనంతరం లోక్ భవన్‌లో వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇచ్చామని.. ఇతరులు ఎవరూ రాకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
కాగా, గవర్నర్ తో భేటీకి ముందే పార్టీ ముఖ్య నేతలతో సమావేశానికి జగన్ నిర్ణయించారు. తాడేపల్లి చేరుకున్న కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను ప్రారంభించారు. ముఖ్య నేతల సమావేశం లో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మెడికల్ కాలేజీల పైన పోరాటం కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. రాజమండ్రి వేదికగా దీక్ష చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన ఈ భేటీలో నిర్ణయించే అవకాశం ఉంది.
అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావటంతో జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. ముందుగా కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. జనవరి మూడో వారం నుంచి రాష్ట్ర వ్యాప్తం గా ఎంపిక చేసిన 60 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో పాటుగా ఫీజు రీయంబర్స్ మెంట్ పైన పోరాటానికి సిద్దం కావాలని జగన్ పార్టీ నేతలకు నిర్దేశించనున్నట్లు సమాచారం. దీంతో.. ఈ భేటీలో జగన్ నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications