తిరుపతికి జగన్ - బాధితుల కోసం కీలక నిర్ణయం..!!

తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట పైన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన పైన ఇప్పటికే ప్రధాని సహా పలువురు ముఖ్య నేతలు స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. కాగా, బాధితులను పరామర్శించేందుకు జగన్ తిరుపతి వెళ్తున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాధితులకు పరామర్శ
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రులకు మరణించిన వారి బంధువులు చేరుకున్నారు. జరిగిన ఘటన పైన రెండు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి రానున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ తిరుపతికి వెళ్లాలని నిర్ణయించారు. జరిగిన ఘటన పైన ఇప్పటికే జగన్ స్పందించారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఈ ఘటన పైన వైసీపీ ముఖ్య నేత.. మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన స్పందిస్తూ.. టీటీడీ అధికారుల తీరును తప్పు బట్టారు. మరణించిన కుటుంబాలకు రూ కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

YS Jagan to visit Stampede Victims in Tirupati Hospitals chances to announce financial support form party

తిరుపతికి జగన్
ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చ కు కారణమైంది. ఈ సమయంలో జగన్ తిరుమలకు వెళ్లాలని ప్రయత్నించారు. కాగా, డిక్లరేషన్ వివాదంతో ఆగిపోయారు. ఇక, ఇప్పుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించటం తో పాటుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం జగన్ తిరుపతిలో బాధితులను కలవనున్నారు. ఘటన పైన విచారణ కు వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి.. క్షతగాత్రులకు జగన్ పార్టీ తరపున ఆర్దిక సాయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

బాధితుల కోసం
అటు టీడీపీ, ప్రభుత్వం సైతం మరణించిన వారికి పరిహారం ప్రకటించేందుకు సిద్దమైంది. మరణించిన వారికి ఒక్కో కుటుంబానికి రూ 25 లక్షల వరకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన వేళ ఈ ఘటన పై విచారణకు ఆదేశించటంతో పాటుగా కీలక అధికారుల పైన చర్యలు తీసుకుంటారని సమాచారం. దీంతో, ఇప్పుడు సీఎం చంద్రబాబు పర్యటన.. ఇటు జగన్ తిరుపతికి వస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+