చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
విజయవాడ:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 20 చంద్రబాబు పుట్టిన రోజు నేడు కావడంతో జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం ద్వారా ఏపీ సిఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని జగన్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది నేడు 68వ జన్మదినం. మరోవైపు చంద్రబాబు తన పుట్టినరోజు నాడు కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా 12 గంటల ఉపవాస దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలనే డిమాండ్‌తో ఆయన శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది.












Click it and Unblock the Notifications