'పనికిరాడనే తెరపైకి ప్రశాంత్ కిషోర్, ఆ రోజు జగన్ పాదయాత్రనా, కోర్టుకా?'
వైసిపి అధినేత జగన్ వయస్సు తక్కువ, ఆశ, కోరికలు మాత్రం చాలా ఉన్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం ఎద్దేవా చేశారు. ఎవరు కూడా ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని భావించడన్నారు.
అమరావతి: వైసిపి అధినేత జగన్ వయస్సు తక్కువ, ఆశ, కోరికలు మాత్రం చాలా ఉన్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం ఎద్దేవా చేశారు. ఎవరు కూడా ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని భావించడన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందని వైసిపి అదినేత జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన చెప్పిన లెక్క రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని నిలదీశారు.

జగన్ రాజకీయాలకు పనికి రాడని..
వైయస్ జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికి రాడనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చారని పత్తిపాటి ఎద్దేవా చేశారు. వైసిపి ప్లీనరీలో నిర్మాణాత్మక విషయాలపై చర్చించలేదని చెప్పారు.
Recommended Video


ఆ రోజు శుక్రవారం.. కోర్టుకా, పాదయాత్రనా?
జగన్ అక్టోబర్ 27వ తేదీన పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారని, ఆ రోజు శుక్రవారం అవుతుందని, మరి ఆయన ఆ రోజున కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో కోర్టుకు హాజరవుతారా లేక పాదయాత్ర చేస్తారా చెప్పాలని నిలదీశారు.

ఏ నేతకు ఉండదు
జగన్ వయస్సు చాలా తక్కువ అని, ఆశ మాత్రం చాలా ఉందని పత్తిపాటి మండిపడ్డారు. ముప్పై ఏళ్లు సిఎంగా ఉండాలనేది తన ఆశ అని జగన్ స్వయంగా చెబుతున్నారని, కానీ ఏ నేతకు కూడా అంత ఆశ ఉండదని చెప్పారు.

ఆదర్శంగా నిలిచాం
రుణమాఫీలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పత్తిపాటి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలే అన్నారు. రేషన్ దుకాణాల్లో పంచదార, కందిపప్పు, మినపప్పు, నూనెలను సెప్టెంబర్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పత్తిపాటి ఇంకా మాట్లాడుతూ.. మాల్స్‌లో కూల్ డ్రింక్స్ అధిక రేట్లకు అమ్మితే కేసులు పెడతామన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications