చంద్రబాబుదే బాధ్యత, పవన్ ఏం చేస్తున్నారు- జగన్ ఆర్దిక సాయం..!!
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వరుసగా ఆడ పిల్లల మీద జరుగుతున్న దారుణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. పిఠాపురంలో టీడీపీ నేతే అత్యాచారం చేస్తే బాధితురాలిని పవన్ కనీసం పరామర్శించ లేదని విమర్శించారు. బాధిత మహిళల కు తమ పార్టీ నుంచి రూ 10 లక్షల చొప్పున జగన్ ఆర్దిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
జగన్ పరామర్శ
మాజీ సీఎం జగన్ తెనాలిలో జరిగిన దాడిలో చికిత్స పొందుతూ మరణించిన సహన కుటుంబ సభ్యులను గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలో వరుసగా ఆడపిల్లల పైన జరుగుతున్న దాడుల పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఈ దాడులకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. బాధిత యువతి పైన దాడి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తాను వస్తున్నానని తెలిసిన తరువాత టీడీపీ నేత వచ్చి పరామర్శ చేసి వెళ్లారన్నారు. తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇప్పటి వరకు ఈ ఘటన పైన స్పందించలేదని విమర్శించారు.

పవన్ కు బాధ్యత లేదా
తెనాలి ఘటనలో నిందితుడు టీడీపీ కార్యకర్తగా జగన్ ఆరోపించారు. తెనాలితో పాటుగా హిందూపురం, బద్వేలు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జరిగిన ఘటనలను జగన్ ప్రస్తావించారు. టీడీపీ ప్రబుద్దులే ఇలాంటి ఘటనలను పాల్పడ్దారని విమర్శించారు. పిఠాపురంలో టీడీపీ నేతే అత్యాచారినికి పాల్పడితే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ కనీసం పరామర్శించ లేదని జగన్ ఆరోపించారు. హిందూపురంలో అత్తా కోడలి పైన గ్యాంగ్ రేప్ జరిగితే నందమూరి బాలక్రిష్ణ పరామర్శించ లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల పైన హోం మంత్రి స్పందించటం లేదని ఆరోపించారు.

జగన్ ఆర్దిక సాయం
బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ముందుకు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ నుంచి బాధితులకు రూ 10 లక్షల చొప్పున ఆర్దిక సాయం అందిస్తామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని .. నాలుగు నెలల కాలంలో 77 మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగాయని ధ్వజమెత్తారు. ఏడుగురు హత్యకు గురి కాగా, నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్ట లేకపోతున్నారని జగన్ మండిపడ్డారు












Click it and Unblock the Notifications