మా పార్టీ పేరులోనే శ్రామికుల నిర్వచనం: జగన్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే శ్రామికుల నిర్వచనం ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామికులు, ఆర్ అంటే రైతులు' అని అర్థమని ఆయన తెలిపారు.
శుక్రవారం మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులందరి పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గుంటూరులో పర్యటించిన ఆయన బస్టాండ్ వద్ద జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో పురుడుపోసుకున్న తమ పార్టీ శ్రామికులకు అండగా ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications