• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతనొక యోధుడు.. అతనొక విప్లవ భావాల ధీరుడు!!

|
Google Oneindia TeluguNews

అతను సాంప్రదాయవాదే. కానీ సాంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తారు.. ఏదైనా ఒకటి తాను నమ్మితే దానికే కట్టుబడతారు.. ఎవరేమనుకున్నా తాను నమ్మాను అంటే కచ్చితంగా అమలు చేసి తీరతారు.. అంతేకాదు.. మొహమాటాలు, రాజీ పడటాలు, పోనీలే అనుకోవడాలేమీ ఉండవు. అదే చంద్రబాబును చూడండి.. ఎక్కువ మొహమాటపడతారు.. సీట్ల విషయంలో రాజీపడేవారు.. పోనీలే అనేవారు.. అంతాచేసి పార్టీ ఓటమికి కారకులవుతారని భావించవచ్చు.

సాంప్రదాయంలో విప్లవ భావాలు కలిగిన జగన్

సాంప్రదాయంలో విప్లవ భావాలు కలిగిన జగన్


కానీ వైఎస్ జగన్ సాంప్రదాయంలో విప్లవ భావాలు అమలు చేస్తున్నవ్యక్తి. రాజకీయాల్లో ఎటువంటి మొహమాటాలు ఉండవు. అంతిమంగా పార్టీకి ఏది సరైన నిర్ణయమవుతుందో దాన్నే అమలు చేస్తారు. ఎవరినైనా తప్పించాల్సి వచ్చినా వారు తన సన్నిహితులా? బంధువులా? దగ్గరివారా? లాంటివేవీ ఉండవు. ఏదన్నా ఉంటే విడిగా మాట్లాడుకుందామంటారేకానీ పార్టీ విషయంలో రాజీపడరు. కొత్త తరంలో కొత్త తరహా రాజకీయాలు ఎలా చేయాలో సీనియర్లకు నేర్పిస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలు చూసిన తర్వాత ఎవరైనా అతను విప్లవ భావాలు కలిగిన రాజకీయవేత్త అంటారు.

తీవ్రమైన మొహమాటం పోయే చంద్రబాబు

తీవ్రమైన మొహమాటం పోయే చంద్రబాబు


అదే మీరు చంద్రబాబునాయుణ్ని పరిశీలించండి.. మొహమాటానికి పోతారు. మొహమాటానికి పోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. సీనియర్ నేతలు చెప్పినదానికి తలూపేస్తారు. పార్టీ ఇంతకాలం సీనియర్లు తమ హవాను చెలాయిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు మొహమాటం. ఆ మొహమాటాన్ని వదిలించుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి చెప్పేవారున్నారు. పాపం.. ఆయన మాత్రం ఏం చేయగలరు. గట్టిగా అడిగినదాన్ని కాదనలేరు. గతంలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు.

మాటలొద్దు.. కేవలం చేతల్లోనే..

మాటలొద్దు.. కేవలం చేతల్లోనే..


వైఎస్ జగన్ మాటలకు అసలు పరిమితం కారు. తాను అనుకున్నది చేతల్లో చూపిస్తారు. ఎవరికీ ఎందులోను మినహాయింపులుండవు. జిల్లా అధ్యక్ష పదవుల నియామకంలోకానీ, ప్రాంతీయ సమన్వయకర్తల నియామకంలోకానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే అందరూ అదే భావిస్తారు. ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు హెచ్చరికల్లాంటివి. పార్టీలో తాము ఎలా పనిచేయాలి? పార్టీ అధినేతతో తాము ఎలా వ్యవహరించాలి? క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? లాంటివన్నిటికీ జగన్ చేతలు సమాధానం చెబుతాయి.

175కు 175 గెలవగలగాలి

175కు 175 గెలవగలగాలి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఇతర ప్రజాప్రతినిధులంతా ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజలతో మమేకమైనవారిని ఏ కేటగిరి కింద, తిరగనివారిని బి కేటగిరి కింద, అసలు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోనివారిని సి కేటగిరిలోకి చేర్చారు. తాను అనుకున్న లక్ష్యం 175 నియోజకవర్గాలకు 175 గెలవడం. అందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలి? అనేదానిపై ఇప్పటికే ఒక స్పష్టతతో ఉన్నారు. డిసెంబరు నెలలో జరిగే వర్క్ షాప్ తో ఎవరెవరికి సీట్లుంటాయి? అనే విషయంలో స్పష్టత వచ్చేస్తుంది. ఆ తర్వాత రాజకీయంగా దబిడి దిబిడే....

English summary
He is a traditionalist.But they think differently from the tradition.. If they believe in something, they will stick to it.. Whoever thinks that means he believes, he will implement it.. Moreover.. There will be no pretences, compromises and ponies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X