ప్రజలకు చంద్రబాబు సర్కార్ ఎంత బాకీ పడిందో వివరించిన జగన్
తన సొంత నిెయోజకవర్గం కడప జిల్లా పులివెందులలో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బ్రాహ్మణపల్లిలో అరటి రైతులను కలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను ఆయనకు వివరించారు. అరటికి గిట్టుబాటు ధర లభించట్లేదని, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల, ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు గద్దెనెక్కినా వ్యవసాయరంగం, రైతులు అల్లాడిపోవడం ఖాయమని, గత చరిత్రను చూస్తే ఈ విషయం తెలుస్తుందని అన్నారు. ఆయన ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ రైతుల జీవనం మొత్తం తిరోగమనమే అవుతుందని విమర్శించారు. ఈ 18 నెలల కాలంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారని, వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో 80 లక్షల రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించామని, దాదాపు రూ.7,400 కోట్లు అందించామని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, 18 లక్షల మంది రైతులకే పంట బీమా సదుపాయం ఉందని, మిగిలిన వారి పరిస్థితి ఏమిటని జగన్ నిలదీశారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడని ధ్వజమెత్తారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా లేదని, చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. పంట వేసే సమయాల్లో మూడు విడతల్లో ఆ మొత్తం ఇచ్చామని, ఏ ఏడాది కూడా దాని ఎగ్గొట్టలేదని తెలిపారు. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా ఎగ్గొట్టారని, అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్ కాకుండా రూ.20,000 ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడని జగన్ చెప్పారు. రెండేళ్లకు మొత్తం రూ.40,000 ఇవ్వాల్సి ఉండగా, 10,000 లకు సరిపెట్టాడని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులతో కలిసి పోరాడుతున్నామని జగన్ పేర్కొన్నారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అన్నీ గాలికెగిరిపోయాయని, అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడని, ఏటా రూ.18,000లతో ఒక్కొక్కరికి రెండేళ్లకు కలిపి 36,000 రూపాయలు చంద్రబాబు బాకీపడ్డారని అన్నారు. నిరుద్యోగ భృతి లెక్క తీస్తే రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి 72,000 అప్పు పడ్డారని జగన్ వివరించారు. అమ్మ ఒడి లబ్దిదారుల్లో 30 లక్షల మందికి కోత పెట్టారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఆస్తులు, కొత్త మెడికల్ కాలేజీలను పప్పులు, బెల్లానికి చంద్రబాబు అమ్మేస్తున్నాడని జగన్ విమర్శించారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల గురించి పట్టించుకోకపోతే వారితో కలిసి ఉద్యమం చేస్తామని జగన్ హెచ్చరించారు. ప్రజలే ఆయనను గద్దె దింపే రోజులు త్వరలోనే వస్తాయని జగన్ అన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications