వైఎస్ షర్మిలకు కీలక అస్త్రం ఇచ్చిన మేనమామ ? అల్లుకుపోతోందిలా..

ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాలన్నీ ఓ ఎత్తు, కడప జిల్లాలో సాగుతున్న రాజకీయం ఓ ఎత్తుగా మారుతోంది. ముఖ్యంగా తన తండ్రి వివేకానందరెడ్డి హత్యలో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో తన చెల్లి వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరుతున్న సునీతారెడ్డికి తాజాగా ఓ అస్త్రం లభించింది. వెంటనే దాన్ని ఒడిసి పట్టేసుకున్న అక్కా చెల్లెళ్లు ఇప్పుడు మరింత బలంగా అవినాష్ ను టార్గెట్ చేస్తున్నారు.

కడప ఎంపీగా మరోసారి బరిలోకి దిగిన మేనల్లుడు వరసైన వైఎస్ అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్న జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. తాజాగా వివేకా హత్యపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా సీబీఐ ఛార్జిషీట్ లో పేర్కొన్న అంశాలతోనే ఇప్పటివరకూ జనంలోకి వెళ్తున్న రాజకీయ ప్రత్యర్ధులు వైఎస్ షర్మిల, సునీతారెడ్డికి రవీంంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు పదునైన ఆయుధంగా మారాయి.

ys jagan s uncle ravindranath reddy gives weapon to ys sharmila on ys viveka s murder


తాజాగా కమలాపురం నియోజకవర్గంలో ఓ బహిరంగ సభలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డికీ, వైఎస్ వివేకా హత్యకు అస్సలు సంబంధం లేదని, వివేకా ఫ్రెండ్ గంగిరెడ్డి ఆయన్ను దారుణంగా హత్య చేస్తుంటే అవినాష్ పక్కనే నిలబడి చూశారని ఆయన వ్యాఖ్యానించారు. గంగిరెడ్డికీ, వివేకాకూ మధ్య పంచాయతీ కాబట్టి అవినాష్ అందులో తలదూర్చలేదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా సీబీఐ ఛార్జిషీట్ లోనూ అవినాష్ తన వాంగ్మూలంలో ఈ హత్య జరిగిన సమయంలో తాను ప్రచారానికి వెళ్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఆయన్ను తన వ్యాఖ్యలతో ఇరికించేశారు.

దీన్ని అందిపుచ్చుకున్న వైఎస్ షర్మిల, సునీతారెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డిపై చెలరేగిపోతున్నారు. తన పక్కనే హత్య జరుగుతుంటే మౌనంగా ఉండటానికి అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగా పసిపిల్లాడా అంటూ షర్మిల తాజాగా ప్రశ్నించారు. అలాగే సునీతారెడ్డి సైతం వివేకా హంతకులు సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఎందుకు మౌనంగా చూడాలని ప్రశ్నించారు. దీంతో రాబోయో రోజుల్లో రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు అవినాష్ కు చేటుగా మారతాయన్న ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+