జగన్ కు షాక్: లోకేష్ కు వైఎస్ షర్మిల క్రిస్మస్ బహుమతులు; రాజకీయవర్గాల్లో ఆసక్తి!!
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తారు అని భావిస్తే, గత ఎన్నికలలో పోటీ చేయకుండా ఆమె వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ రాజకీయాల్లో కూడా అడుగు పెడతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్ప చెబుతారు అన్న ప్రచారం సాగుతున్న వేళ వైయస్ షర్మిల చేసిన ఒక పని ఇప్పుడు రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆమె క్రిస్మస్ సందర్భంగా కానుకలు పంపించారు.

దాంతోపాటు ద వైయస్సార్ ఫ్యామిలీ విషెస్ యు.. ఎ డిలైట్ ఫుల్ క్రిస్మస్ అండ్ ఏ బ్లెస్డ్ 2024 అన్ని రాసి ఉన్న గ్రీటింగ్ కార్డును కూడా పంపారు. ఇక ఇదే విషయాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. షర్మిలకు ధన్యవాదాలు తెలియజేశారు.
అద్భుతమైన కానుకలు పంపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్న నారా లోకేష్, నారా కుటుంబం తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. షర్మిల పంపిన గ్రీటింగ్ కార్డును, గిఫ్ట్ బాక్సుల చిత్రాలను తన ట్వీట్ తో పాటు జత చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Dear @realyssharmila Garu,
— Lokesh Nara (@naralokesh) December 24, 2023
Please accept my heartfelt thanks for the wonderful Christmas gifts. Nara family wishes you and your family Merry Christmas and a Happy New Year. pic.twitter.com/4yn4SiGcjv
అయితే ఏపీ రాజకీయాలలో బద్ధ శత్రువులుగా భావించే జగన్, చంద్రబాబుల వార్ పీక్స్ లో కొనసాగుతున్న సమయంలో షర్మిల చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ పండుగ సందర్భంగా గిఫ్ట్ లు పంపించడం ఏపీ రాజకీయాలలో ఆశ్చర్యాన్ని, అసలేం జరుగుతుంది అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా షర్మిల ట్విట్టర్ వేదికగా కూడా తన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు.
అలాంటిది ప్రత్యర్థి పార్టీకి చెందిన వారికి క్రిస్మస్ పండుగ బహుమానాలు ఎందుకు పంపించారు అన్నది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తుంది. గత కొంతకాలంగా జగన్ కు షర్మిలకు మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బ తిన్నాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో, ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్న సమయంలో క్రిస్మస్ పండుగకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు బహుమతులు పంపించి వైయస్ షర్మిల ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.












Click it and Unblock the Notifications