ఏపీకి కొంచెం పనుండి వచ్చా: వైఎస్ షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ను ఇటీవలే కొందరు హత్య చేశారు. ఈ కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు.
అవినాష్ అనుచరులే భూమి కోసం హత్య చేశారన్నారు. నిందితులను కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలు, అక్రమాలు జరుగుతున్నాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

కమలాపురం ఎమ్మెల్యే, మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డిపై షర్మిల విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి వచ్చానని తన మేనమామ అంటున్నారని, అక్కడ కేసీఆర్ ను ఓడించామని, అక్కడ తమ పని అయిపోయిందని, ఏపీలో పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చానన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నవారికి వైసీపీ టికెట్లు ఇస్తోందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయితే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని, శంకుస్థాపనలేకానీ అంగుళం కూడా ముందుకు కదలలేదన్నారు.
జగన్ కుంభకర్ణుడు అని, ఆరునెలల ముందు నిద్ర లేచారని, వివేకాను హత్యచేసినవారు యథేచ్ఛగా తిరుగుతున్నారని, అని ఆధారాలున్నప్పటికీ చర్యలు మాత్రంలేవన్నారు. నిందితుడికే జగన్ టికెట్ ఇచ్చారని, హత్య చేసినవారినే తిరిగి గెలిపించాలనుకుంటున్నారని, వివేకాను హత్య చేసినవారా? వైఎస్ఆర్ బిడ్డ కావాలో తేల్చుకోవాలని, వైఎస్సార్ లా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications