ఆఫ్రికాకు పోతారో.. అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవడిక్కావాలి.. జగన్

YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటిపోరు తప్పట్లేదు. సొంత చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు తలపోటు తెప్పిస్తోన్నారు. రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తోన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులతో పోటీ పడతున్నారు.

వైఎస్ఆర్సీపీ దేశ రాజధానిలో ధర్నాకు దిగడం పట్ల నిన్నటికి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడిందంటూ విమర్శించారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులుముతున్నారంటూ మండిపడ్డారు. అయిదు సంవత్సరాల పాటు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోసం చూస్తోన్నారంటూ ఆరోపించారు.

YS Sharmila demands YS Jagan s resignation

ఇప్పుడు తాజాగా మరోసారి జగన్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ చేస్తోన్న ప్రయత్నాలను తప్పుపట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతాననడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని చురకలు అంటించారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవని అన్నారు.

మోసం చేయడం జగన్‌కు కొత్తేమీ కాదని, ఆయనను గెలిపించి, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం ఆయనకే చెల్లిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనంగా అభివర్ణించారు.

ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అంటూ నిలదీశారు షర్మిల. ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ సభ్యుడని, మీడియా అసెంబ్లీలో కాదని ఎద్దేవా చేశారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్‌లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు జగన్‌ను ఎమ్మెల్యేను చేసిందని అన్నారు.

గత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న విమర్శలపై అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత జగన్‌ది కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత ఆయన మీదే ఉందని గుర్తు చేశారు.

అసెంబ్లీకి పోనని చెప్పే జగన్‌కు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే పదవికి కూడా అర్హుడు కాదని, వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలని, వెంటనే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లని సభ్యుడికి ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+