అసెంబ్లీ బరిలో షర్మిల, నియోజకవర్గం ఫిక్స్ - అసలు టార్గెట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల నేతలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ లక్ష్యంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అటు జగన్ సైతం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. ఇందు కోసం నియోజకవర్గం ఫిక్స్ చేసుకుంటున్నారు.
ఏపీలో షర్మిల ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి పార్టీల కంటే జగన్ పైనే ఎక్కువగా పీసీసీ చీఫ్ షర్మిల రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారనే చర్చ ఉంది. అయితే.. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జోష్ పెరుగుతుందని భావించినా.. అలాంటి ఫలితం కనిపించటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో.. షర్మిల వచ్చే ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. తాను ఈ సారి పార్లమెంట్ కు కాకుండా.. అసెంబ్లీ బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఇందు కోసం కడప జిల్లా నుంచి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో 2024 ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. దీంతో, ఇప్పటి నుంచే తాను నిర్ణయించు కున్న నియోజకవర్గంలో వర్క్ స్టార్ట్ చేయాలని షర్మిల భావిస్తున్నారు.

కొత్త వ్యూహాలతో షర్మిల
షర్మిల తాను పోటీ చేయటం కోసం కడపతో పాటుగా కమలాపురం నియోజకవర్గాల పైన ఆసక్తిగా ఉన్నారు. కమలాపురం విజయమ్మ సొంత ప్రాంతం కావటం... వైఎస్ కుటుంబానికి అక్కడ తొలి నుంచి ఆదరణ ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అదే విధంగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక లెక్కలు.. ముస్లిం మైనార్టీ ఓటింగ్ పార్టీ పరంగా.. వ్యక్తిగతంగా ఉన్న గుర్తింపు తనకు కలిసి వచ్చే అంశాలుగా లెక్కలు వేస్తున్నారు. ఈ నియోజవర్గాలకు సంబంధించి షర్మిల సర్వేలు చేయిస్తున్నారు.
ఈ సర్వే నివేదికలు అందిన తరువాత షర్మిల పైనల్ చేసుకున్న నియోజకవర్గం నుంచి తన కార్యాచరణ ప్రారంభించనున్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటం ద్వారా వైసీపీ ఓట్ బ్యాంకు కు చెక్ పెట్టటంతో పాటుగా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. దీంతో.. వచ్చే ఎన్నికల నాటికి షర్మిల రాజకీయ వ్యూహాలు ఎంత వరకు కలిసి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications