షర్మిల ఇంటి వద్ద పోలీసు బలగాల మోహరింపు

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన జాతీయ స్థాయి ఉద్యమం క్రమంగా పతాక స్థాయికి చేరుకుంటోంది. నేడు దేశ రాజధానిలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొనడానికి ముంబై నుంచి ఢిల్లీ వెళ్లిన ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అరెస్ట్ సైతం అయ్యారు. ఆయనతో పాటు సీజేపీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో విజయవాడలో ఏపీసీసీ ప్రధాన కార్యాలయం ఆంధ్ర రత్న భవన్, అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా చేపట్టిన ఈ భద్రతా చర్యలపై చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు.

YS Sharmila Questions Andhra Government Over Police deployment at APCC office and her House

విజయవాడలోని ప్రధాన కూడళ్లు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, తన నివాస పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచే పోలీసులు పెద్ద సంఖ్యలో కాపలా ఉండటంపై షర్మిల విమర్శలు గుప్పించారు. గుడ్ మార్నింగ్ సీఎం గారూ.. ఎందుకీ నిద్రలేని రాత్రులు అంటూ నిలదీశారు. ఇదంతా బీజేపీ సేవల కోసమేనా? అంటూ ప్రశ్నించారు. పోలీసులను ఉపయోగించి భయపెట్టే ప్రయత్నం చేస్తోన్నారని, ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

బంగారం ధరలు తగ్గట్లేదు- అదే దూకుడు
బంగారం ధరలు తగ్గట్లేదు- అదే దూకుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకం కంటే పోలీసుల బలగాన్నే ఎక్కువ నమ్ముకుంటోందని వైఎస్ షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల శక్తిని మాత్రమే విశ్వసిస్తుందని, పోలీసుల బలప్రయోగానికి, రాజకీయ ఒత్తిళ్లకు భయపడేది కాదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే ప్రతిపక్షాలను చూసి ఎక్కువగా భయపడుతోందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉందనే ధీమాతో ప్రతిపక్షాల స్వరాన్ని నొక్కాలనుకోవడం సరికాదని అన్నారు.

ధృవ్ రాఠీ అరెస్ట్..: మఫ్టీలో ఇంటికి వెళ్లిన పోలీసులు: అదుపులో స్టార్ యూట్యూబర్
ధృవ్ రాఠీ అరెస్ట్..: మఫ్టీలో ఇంటికి వెళ్లిన పోలీసులు: అదుపులో స్టార్ యూట్యూబర్

ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేయడానికి పోలీసులు యత్నిస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఎంతమంది పోలీసులను మోహరించినా, ఎన్ని రకాల ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఆమె తేల్చిచెప్పారు. పోలీసులు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలని, అధికార పక్షానికి కొమ్ముకాయడం మానుకోవాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+