మీకు ఆ దమ్ముందా - షర్మిల సవాల్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జగన్ కు గుంటూరు లో భద్రత కల్పించకపోవటం పైన వైసీపీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ఈ సారి అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే అంశం పైన పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. తన పైన వ్యాఖ్యలు చేసిన బొత్సాకు ఘాటు రిప్లై ఇచ్చారు. వైసీపీని సవాల్ చేసారు.
బీజేపీకి దత్త పుత్రుడుగా
పీసీసీ చీఫ్ షర్మిలను ఉద్దేశించి మండలిలో ప్రతిపక్ష నేత బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు. వీటికి కౌంటర్ గా షర్మిల వైసీపీని టార్గెట్ చేసారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘంగా చేసిన పోస్టులో పలు అంశాలను ప్రస్తావించారు. షర్మిల తన పోస్టులో.. "బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర ప్రజానీకానికి తెలు సు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు. పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని ఎద్దేవా చేసారు.

11 సీట్లకు పరిమితం
ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని ఎద్దేవా చేసారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారు. మిర్చి రైతుల కష్టాలపై మీకంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ. సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.
బొత్స సత్యనారాయణ @BotchaBSN గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ…
— YS Sharmila (@realyssharmila) February 20, 2025
తేల్చి చెప్పండి
ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశామని గుర్తు చేసారు. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగామని పేర్కొన్నారు. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పండని డిమాండ్ చేసారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటిం చండని సవాల్ చేసారు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసింది. దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి..అంటూ షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications