వైఎస్ షర్మిల కుమార్తె అంజలి పెళ్లి, రిసెప్షన్ డేట్స్ ఫిక్స్-ఎక్స్ లో ట్వీట్..!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తన ఏకైక కుమార్తె వైఎస్ అంజలీ రెడ్డి పెళ్లికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే పెళ్లి కుమారుడు, వారి కుటుంబ నేపథ్య వివరాలు ప్రకటించిన షర్మిల.. ఇవాళ పెళ్లి నిశ్చితార్దం, పెళ్లి వేడుక, రిసెప్షన్ తేదీల్ని కూడా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కుమార్తె వైఎస్ అంజలీ రెడ్డి వివాహానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో..తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి -సోమల రఘురామ్ రెడ్డిల..పరిశుద్ధ వివాహ మహోత్సవం వైఎస్సార్ కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణమని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల 24న వైఎస్ అంజిలీ రెడ్డి- సోమల రఘురామ్ రెడ్డి వివాహ నిశ్చితార్దం జరుగుతుందని షర్మిల వెల్లడించారు. అనంతరం నవంబర్ 25న వీరిద్దరి వివాహం ఉంటుందన్నారు. అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు ఎక్స్ లో చేసిన ట్వీట్ లో తెలిపారు. తొలి పెళ్లి కార్డును వైఎస్సార్ ఘాట్ వద్ద పెట్టి మహానేత ఆశీస్సులు తీసుకున్నామని షర్మిలా రెడ్డి తెలిపారు. ఇరువురి కలయిక దైవ సంకల్పమని, నూరేళ్ల జీవితానికి శుభారంభమని సంతోషం వ్యక్తం చేశారు. దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకమన్నారు.

నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
— YS Sharmila (@realyssharmila) September 18, 2026
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే… pic.twitter.com/nibFyREPiY
కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల..తొలి వివాహ ఆహ్వాన పత్రికను తన కుటుంబ సభ్యులతో, రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి..ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నారు. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ అన్నారు. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని షర్మిల తెలిపారు.














Click it and Unblock the Notifications
