ప్రియమైన లోకేష్ అంటూనే.. వైఎస్ షర్మిల చురకలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇటీవల కాలంలో వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని, డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని వైయస్ షర్మిల విమర్శిస్తున్నారు.
లోకేష్ కు షర్మిల కౌంటర్
తాజాగా మరో మారు మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి షర్మిల కౌంటర్ వేశారు. సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ షర్మిల. మంత్రి నారా లోకేష్ ఒక ఇంటర్వ్యూలో 22 లోక్సభ సీట్లకు గాను 21 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు గర్వంగా ఉందని చేసిన వ్యాఖ్యలకు వైయస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.

ఫ్రాంక్ గా చెప్పండి లోకేష్
ప్రధాని మోడీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ ఎద్దేవా చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే టీవీ షోలో మిమ్మల్ని చూడడం చాలా బాగుందని కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంపై మీ ఉద్దేశాలను ఫ్రాంక్ గా చెప్పాలని కోరుకుంటున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
ఇది సిగ్గు చేటు.. షర్మిల ఎద్దేవా
మీ సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇప్పటికే నెరవేరలేదని నారా లోకేష్ కు షర్మిల గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి ప్రతీ వారం ఢిల్లీకి పరుగులు తీస్తున్నా, మోదీ ఏపీకి ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టులకు ఏ దిక్కు లేకుండా పోయిందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ప్రియమైన లోకేష్ అంటూనే చురకలు
ప్రియమైన నారా లోకేష్ గారు అంటూనే ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వయసు షర్మిల లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇక లోకేష్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కార్యక్రమంలో పీఎం మోడీకి 22 లోక్సభ స్థానాలను ఇస్తామని ప్రామిస్ చేసి 21 ఇచ్చామని, ఒక సీటు ఇవ్వలేకపోయినందుకు ప్రధాని మోడీకి తాము క్షమాపణలు చెప్పామని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైయస్ షర్మిల లోకేష్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications