చంద్రబాబు పై గురి పెట్టిన షర్మిల..!!
ఏపీ ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ఎన్నికల యుద్దం పతకా స్థాయికి చేరింది. షర్మిల పాత్ర ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారనుంది. షర్మిల ఎన్నికల ప్రచార సభల్లో ఇప్పటి వరకు జగన్ పైనే ప్రధానంగా పోకస్ చేసారు. ఇప్పుడు జగన్ తో పాటుగా చంద్రబాబు పైన గురి పెట్టారు. తాజాగా మడకశిరలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల ఇప్పుడు జగన్, చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
షర్మిల ప్రచారం
పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల..వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ అవినాశ్ పైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ అధికారంలో వచ్చాక ప్రాజెక్ట్ పట్టింపు లేదన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారని..ఒక్క పరిశ్రమ రాలేదని విమర్శించారు. గత 10 ఏళ్లుగా ఈ నియోజక వర్గాన్ని టీడీపీ, వైసీపీ మోసాం చేసాయన్నారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవనని.. హోదా వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని చెప్పారు. హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. అయినా బీజేపీ తో బాబు,జగన్ పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.

జగన్ -చంద్రబాబు టార్గెట్
బీజేపీతో బాబు పొత్తు పెట్టుకుంటే..జగన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పొత్తులు, తొత్తులకు ఓట్ వేయటం అవసరమా అని ప్రశ్నించారు. ఇద్దరూ బీజేపీకి గులాం చేస్తూ..బానిసలుగా మారారని షర్మిల ఫైర్ అయ్యారు. ఒక్క సీటు లేని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు, జగన్ కు ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన బీజేపీ,బాబు,జగన్ లు ఈ రాష్ట్రానికి అవసరమా అని నిలదీసారు. హోదా ఇవ్వని,మోసం చేసిన ఈ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించిన షర్మిల హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

షర్మిల హామీలు
రాష్ట్రంలో అధికారంలో వస్తె మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదేనని షర్మిల హామీ ఇచ్చారు. 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ మీదనే తొలి సంతకం చేస్తామన్నారు. ఏడాదికి పెద్ద మహిళకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వృద్దులకు 4 వేలు...వికలాంగులకు 6 వేలు పెన్షన్ అందిస్తామన్నారు. ఎన్నికలు ఉన్నాయని జగన్ సిద్ధం అంటూ బయటకు వస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారని.. ప్రజల సమస్యలు ఏనాడైనా విన్నారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications