మాటలే.. చేతల్లేవు: కెసిఆర్, బాబులపై విజయమ్మ, టి ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప, చేతల్లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు. ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ...
అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.
ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని, పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైయస్సార్‌లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైయస్సార్ సంకల్పమని అన్నారు. వైయస్సార్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైయస్సార్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని విజయమ్మ తెలిపారు.

కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయి: పొంగులేటి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసి శ్రమిద్దామని నేతలు, కార్యకర్తలకు సూచించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడేలా పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అందరం కష్టపడి పనిచేద్దామని, తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని పొంగులేటి చెప్పారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications