వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పోరాటం న్యాయమైంది: విజయమ్మ,ఆసుపత్రిలోనే ఇద్దరు ఎంపీల దీక్షలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరహరదీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరహరదీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తున్న ఎంపీలను విజయమ్మ ఆదివారం నాడు పరామర్శించారు.దీక్షకు సంఘీభావం తెలిపారు.మరో వైపు ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి , వరప్రసాద్ దీక్ష చేస్తున్నారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ ఎంపీు రెండు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరహరదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ప్రత్యేక హోదా అనేది ఏపీ రాష్ట్రానికి ఊపిరి వంటిందని విజయమ్మ అభిప్రాయపడ్డారు. విభజన హమీలను కేంద్రం ఇంతవరకు అమలు చేయలేదని చెప్పారు. ఈ హమీలను అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ys vijayamma supports ysrcp mps hunger strike in New Delhi

ఢిల్లీ పెద్దలను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని పార్టీలు కలిసిరావాలని విజయమ్మ కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని ఆమె గుర్తు చేశారు.. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొదటి నుంచి ప్రత్యేక హోదాకై అలుపెరుగని పోరాటం చేస్తున్నారన ఆమె గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆమె విమర్శించారు. పార్లమెంట్‌లో కూడా అదే జరిగిందని వైఎస్‌ విజయమ్మ మండిపడ్డారు. 12 సార్లు అవిశ్వాసం పెడితే చర్చకు రాకుండా చేసిన చరిత్ర ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరహర దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడ క్షీణించింది. శనివారం సాయంత్రం నుండి వరప్రసాద్ జ్వరంతో బాధపడుతున్నారు. దీనికితోడుగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీక్ష విరమించాలని వరప్రసాద్‌కు వైద్యులు సూచించారు.

ఏపీ భవన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కూడ వైసీపీ ఎంపీలు దీక్షలను విరమించాలని కోరారు. వైద్యుల సూచనలను ఎంపీ వరప్రసాద్ తిరస్కరించారు.అయితే వరప్రసాద్‌ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని వర ప్రసాద్ ప్రకటించారు.

ఆసుపత్రిలోనే మేకపాటి దీక్ష

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆమరణ నిరహరదీక్షకు కూర్చొన్న వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. ఆయన వెంటనే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. ఆయన తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడుతున్న మేకపాటి, దీక్షను కొనసాగిస్తే, ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించినట్టు వైసీపీ నేతలు తెలిపారు.పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన సంగతి తెలిసిందే. ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు యత్నించగా, నిరాకరించిన మేకపాటి, ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు.

English summary
Ysrcp honorary president Ys Vijayamma supported too Ysrcp MP's hunger strike on Sunday at New Delhi.she made allegations on union government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X