పులివెందుల‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటి కొల‌త‌లు తీసుకున్న సీబీఐ అధికారులు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. పులివెందుల‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటిని ప‌రిశీలించి కొల‌త‌లు తీసుకున్నారు. జ‌గ‌న్ ఇంటితోపాటు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ద‌స్త‌గిరి, ఉమాశంక‌ర్‌రెడ్డి, సునీల్ యాద‌వ్ నివాస ప్రాంతాల‌ను కూడా అధికారులు ప‌రిశీలించారు. స‌ర్వేయ‌ర్ల‌తో ఇంటి కొల‌త‌లు తీయించారు. ఇప్ప‌టివ‌ర‌కు వివేకా హ‌త్య‌కేసులో ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగాకానీ జ‌గ‌న్ ఇంటివైపు వెళ్ల‌లేదు. ఇప్పుడు అక‌స్మాత్తుగా ముఖ్య‌మంత్రి ఇంటి కొల‌త‌లు తీయించ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది.

రెండు విడ‌త‌లుగా వివేకా పీఏ విచార‌ణ‌

రెండు విడ‌త‌లుగా వివేకా పీఏ విచార‌ణ‌

వివేకానంద‌రెడ్డి పీఏ ఇన‌య‌తుల్లాను సీబీఐ అధికారులు రెండు విడ‌త‌లుగా విచారించారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఇన‌య‌తుల్లాను పులివెందుల‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి పిలిపించిన అధికారులు ఆయ‌న‌తోపాటు ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్‌, ఒక ప్ర‌యివేట్ ఫొటోగ్రాఫ‌ర్‌, వీఆర్‌వోను వెంట‌పెట్టుకొని ప‌లు ప్రాంతాల్లో క‌లియ‌తిరిగారు. అవినాష్‌రెడ్డి ఇంటి బ‌య‌ట స‌ర్వే నిర్వ‌హించారు. దీంతోపాటు వాచ్‌మెన్ రంగ‌న్న ఇల్లు, దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఆసుప‌త్రి, పాత ఆసుప‌త్రిబ‌య‌ట‌, వైసీపీ కార్యాల‌యంతోపాటు ప‌లు ప్ర‌దేశాల్లో స‌ర్వే నిర్వ‌హించారు.

Recommended Video

    YS Vivekananda Reddy కేసులో CBI దూకుడు, విచారణ మలుపులు | YSRCP | Oneindia Telugu
    ఒక్క‌సారిగా దూకుడు పెంచిన సీబీఐ

    ఒక్క‌సారిగా దూకుడు పెంచిన సీబీఐ

    కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్న సీబీఐ అధికారులను ఇటీవ‌ల కొంద‌రు బెదిరింపుల‌కు గురిచేశారు. దీంతోపాటు అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై పోలీస్ కేసులు న‌మోదు చేశారు. ఈ ప‌రిణామాల‌న్నీ ప‌రిశీలించిన సీబీఐ అధికారులు ఒక్క‌సారిగా దూకుడు పెంచారు. కేసును కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటిని ప‌రిశీలించడానికి దారితీసిన ప‌రిస్థితులేమిట‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు.

    వివేకా ఇంటిలో గంట‌న్న‌ర ప‌రిశీల‌న‌

    వివేకా ఇంటిలో గంట‌న్న‌ర ప‌రిశీల‌న‌

    స‌ర్వే నిర్వ‌హించే స‌మ‌యంలో ఫొటోలు, వీడియోలు అధికారులు తీయించారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇంటివ‌ద్ద కూడా స‌ర్వే నిర్వ‌హించిన అనంత‌రం ఇంట్లోకి వెళ్లి దాదాపు గంట‌న్న‌ర‌పాటు కూలంకుషంగా ప‌రిశీలించారు. మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు తిరిగి ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్నారు.

    ప్ర‌త్యేక వ‌స‌తులు కావాలంటున్న దేవిరెడ్డి

    ప్ర‌త్యేక వ‌స‌తులు కావాలంటున్న దేవిరెడ్డి

    క‌డ‌ప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి జైలులో త‌న‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాల‌ని జిల్లా సెష‌న్స్ కోర్టులో పిటిష‌న్ వేశారు. వాస్త‌వానికి దీనిపై మంగ‌ళ‌వార‌మే తీర్పు రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ గురువారానికి వాయిదా ప‌డింది. వివేకా హ‌త్య‌కేసులో శంక‌ర్‌రెడ్డి ఏ-5గా రిమాండ్‌లో ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+