సునీత మాట మార్చారు, అవినాశ్ ను వేధిస్తున్నారు : సీఎం జగన్ మేనత్త విమలమ్మ..!!

వివేకా హత్య కేసు పరిణామాలపై వైఎస్ సోదరి..సీఎం జగన్ మేనత్త విమలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. అవినాశ్ ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సునీత తొలుత ఈ హత్యతో కుటుంబంలో ఎవరికీ సంబంధం లేదని చెప్పి మాట మార్చారని చెప్పుకొచ్చారు. సునీతపై దుష్టశక్తులు ప్రభావం చూపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

విమలమ్మ పరామర్శ:విమలా రెడ్డి కర్నూలు ఆస్పత్రిలో అవినాశ్ తల్లిని పరామర్శించారు. అవినాశ్ తో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాల్లో ధైర్యం చెప్పారు. వివేకా హత్య కేసుపై స్పందించారు. అవినాశ్ తల్లి ఆరోగ్యం కొంత మెరుగు పడిందని వివరించారు. తాను అవినాశ్ తో మాట్లాడానని...తనలో ఎక్కడా తప్పు చేసాననే భావన కనిపించ లేదన్నారు. అవినాశ్ ఏంటో తమకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పిన విమలా రెడ్డి.. ఇప్పడిప్పుడే కొంత గట్టిపడుతున్నారని వ్యాఖ్యానించారు. సీబీఐ వాళ్లు అంత తెలివి లేని వాళ్లు కాదన్నారు. ఏడు సార్లు గంటల తరబడి విచారించి రుజువులు లేక హడావుడి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం తమను భయపెట్టేందుకే హంగామా చేస్తున్నారా అని ప్రశ్నించారు.

YS Viveka Row: Jagans aunt YS Vimala Reddy sensational comments, says YS Sunitha had changed her stand

హత్య చేసిన వాల్లు బయటే ఉన్నారు:వివేకా ను చంపిన వాళ్లు బయటే ఉన్నారన్నారు. అవినాశ్ పాత్ర లేదని తాను నమ్ముతున్నట్లు వివరించారు. దస్తగిరి తన అన్న వివేకాను చంపి హీరోలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. దస్తగిరి తాను వివేకాను భయంకరంగా ఎలా చంపిందీ వివరిస్తుంటే ఎలా చూపిస్తున్నారని నిలదీసారు. వివేకా హత్య కేసులో నలుగురు ఒప్పుకున్నారని, తాను అదే నమ్ముతున్నానని చెప్పారు. దస్తగిరి మాట్లాడేది వింటుంటే రక్తం ఉడికిపోతోందని ఆవేదన వ్యక్తం చేసారు. చంపిన వాడిని జైల్లో పెట్టకుండా ఏమీ చేయని వారిని ఎలా వేధిస్తారంటూ విమల నిలదీసారు. తన తండ్రి హత్య పైన తొలి నుంచి సునీత పోరాటం చేస్తోందని విమలా చెప్పుకొచ్చారు. సునీతతో తాము మాట్లాడిన అంశాలను వెల్లడించారు.

అవినాశ్ కు సంబంధం లేదంటూ:తొలుత తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేని చెప్పి తరువాత మాట మార్చారని చెప్పారు. సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాము సునీతతో మాట్లాడామని..తొలుత అంగీకరించి ఆ తరువాత మంచి చెప్పిన తమతో దూరంగా ఉంటున్నారని విమలమ్మ వివరించారు. వివేకా హత్య కేసులో ఆలస్యమైనా న్యాయం జరుగుతుందన్నారు. సొంత వాళ్లే విరోధులు కావటం బాధాకరమని చెప్పారు. సీఎం జగన్ - షర్మిల మధ్య విభేదాల పైన స్పందించారు. ప్రతీ కుటుంబంలో విభేదాలు సహజమని..తరువాత వారే కలిసిపోతారని చెప్పుకొచ్చారు. కానీ, ఈ గ్యాప ను భూతద్దంలో చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీబీఐ కేసు నుంచి అవినాశ్ బయటపడతారని విమల ఆశాభావం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+