వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్.. పీఏ కృష్ణా రెడ్డి సంచలన ఆరోపణలు..
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. తాజాగా వివేకా పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈకేసులో కొందరి పేర్లు చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు కృష్ణా రెడ్డి తరుపున లాయర్ లోకేశ్వర్ రెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఏస్పీ అదికారి రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు.

సీబీఐ అధికారుల వేదింపులు..?
సీబీఐ అధికారులు తనను వేదింస్తున్నారంటూ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. అనేక సార్లు పులివెందులతో పాటు ఢిల్లీకి పిలిచి విచారణ చేశారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తనను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. కొందరి పేర్లను చెప్పాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని పిటిషన్ లో కోర్టు దృష్టికి కృష్ణారెడ్డి తీసుకువచ్చారు.

వివేకా కూమార్తె, అల్లుడుపై కూడా..
సీబీఐ అధికారుల వేధింపులు, బెదిరింపులపై పులివెందుల పోలీస్‌స్టేషన్‌తో పాటు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కి ఫిర్యాదు చేసేసినట్లు తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించామని కృష్ణారెడ్డి తరపు లాయర్ లోకేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అటు సీబీఐకి మద్దతుగా వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమార్తె సునీత రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు..తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.

దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఆరోపణలు
అటు వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్మూలంతో సీబీఐ అధికారులు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఇంతలోనే దీంతో శంకర్ రెడ్డి, ఆయన కుమారుడు సీబీఐ డెరెక్టర్‌కు లేఖ రాశారు. వివేకా హత్య కేసులో తనుకు ఎలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఆరోపించారు.
Recommended Video

గతంలో గంగాదర్ రెడ్డి.. ఇప్పుడు కృష్ణారెడ్డి..
కృష్ణారెడ్డి తరహాలోనే గతంలో కూడా అనంతపురం ఎస్పీని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కలిశాడు. ఇదే విధంగా ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని బెదిరించినట్లు చెప్పారు. డబ్బులు కూడా ఆశ చూపారని గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హానీ ఉందని చెప్పడంతో ఆయను పోలీసులు భద్రత కల్పించారు. ఇప్పుడు ఇదే తరహాలో కృష్ణారెడ్డి సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తీరుగుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications