జగన్ పార్టీ గొడవ: ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని చూడలేదని బాబు చిరాకు
హైదరాబాద్: పట్టిసీమపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సమయంలో తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు బుధవారం శాసనసభలో గందరగోళం సృష్టించారు. ఈ సమయంలో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని తాను ఇంత వరకు చూడలేదని అన్నారు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే సహించబోమని అన్నారు.
సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని, పార్టీ అంతర్గత సమస్యను తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారని ఆయన అన్నారు. అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంతర్గత సమస్య అని ఆయన అన్నారు. దయచేసి కూర్చోండి అంటూ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పదే పదే చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. కొంత సేపటి తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు.

సభలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. వైఎస్ ఏం చేయలేదని అధికార పక్షం అనడాన్ని ఆయన ఖండించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీరు ఇచ్చారని, రాయలసీమ ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామ ని ఆయన చెప్పారు.
జ్యోతుల నెహ్రూ మాట్లాడడానికి ముందు వైయస్సార్ కాంగ్రెసు సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుందాతనం అవసరమా, లేదా అని ఆయన అడిగారు. జాతీయ పార్టీగా స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపిని పట్టుకుని తోక పార్టీ అనడం సరి కాదని ఆయన అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కొంత మంది సభ్యులైతే ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడిన తర్వాత సభ సద్దుమణిగింది. చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించి కొనసాగించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications