జగన్‌పార్టీకి బాబు అండ!: అరెస్ట్‌కి సంబంధంలేదని ఆనం

దీనిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దానికి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సభను అడ్డుకుంటున్నందు వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశామని, వారి సస్పెన్షన్‌కు, బయటి అరెస్టుకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
సభ నుండి వెళ్లాక వారు రవీంధ్ర భారతి జంక్షన్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా అస్తవ్యస్తం చేశారని, అందుకే వారిని అరెస్టు చేశారని, విడిపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్నారు. అంతేగాని, సస్పెన్షన్‌కు, అరెస్టుకు సంబంధం లేదన్నారు.
ఆనం వివరణపై స్పందించిన చంద్రబాబు... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులను మీడియా పాయింటు వద్దకు కూడా వెళ్లనివ్వలేదని తమకు తెలిసిందని, తాము ప్రస్తావించిన దానిని ఆనం తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. హుందాగా చర్చ సాగాలని సభకు సహరిస్తున్నామని చెప్పారు.
గడువు పెంచాలని కోరుతాం: జెసి
ఈ నెల 23 తేదీ వరకు రాష్ట్రపతి గడువు ఇచ్చారని, దానిని పెంచాలని కోరుతామని అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications