వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూకుడు తగ్గించుకుంటూ వెళ్తున్నా, అలా అనుకోవద్దు: బాలకృష్ణపై పోటీ చేసిన వైసీపీ నేత

|
Google Oneindia TeluguNews

హిందూపురం: తాను దూకుడును తగ్గించుకొని ముందుకు వెళ్తున్నానని, ఒక ఆలోచనా విధానంతో ముందుకు సాగుతున్నానని హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ నిశ్చల్ అన్నారు.

'బాబును పిలుద్దామనే అనుకున్నాంకానీ, మాట రాకుండా కేసీఆర్ ఇలా, ఏం జరిగిందంటే''బాబును పిలుద్దామనే అనుకున్నాంకానీ, మాట రాకుండా కేసీఆర్ ఇలా, ఏం జరిగిందంటే'

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2004లోని నవీన్‌కు, 2017లోని నవీన్‌కు చాలా తేడా ఉందని చెప్పారు. దెబ్బలు తగులుతుంటే ఈ దరి మనది కాదని, దూకుడును తగ్గించుకొని ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఆలోచనా విధానంతో వెళ్తున్నానని చెప్పారు.

ప్రతి సంవత్సరం కొత్త పాఠం

ప్రతి సంవత్సరం కొత్త పాఠం

ప్రతి సంవత్సరం తాను కొత్తపాఠం నేర్చుకుంటున్నానని, తమ కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదని, తన తండ్రి మేథమ్యాటిక్స్ ప్రొఫెసర్ అని, తమ కుటుంబంలోని వాళ్లందరూ ఉద్యోగస్తులేనని నవీన్ నిశ్చల్ తెలిపారు. తన తండ్రి స్వస్థలం బుక్కపట్నమని, ఉద్యోగరీత్యా హిందూపురం వచ్చారని తెలిపారు.

 హిందూపురంలో తొలి బార్ అండ్ రెస్టారెంట్ మాదే

హిందూపురంలో తొలి బార్ అండ్ రెస్టారెంట్ మాదే

తాను హిందూపురం, గుంతకల్లులో చదువుకున్నానని చెప్పారు. ఎల్ఎల్‌బీ చేస్తూ మధ్యలో ఆపేశానని, అసలు తనకు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయాలని ఉండేదని, హిందూపురంలో మొదటి బార్ అండ్ రెస్టారెంట్ తమదే అని చెప్పారు.

 రాజకీయాలపై ఆసక్తి కలిగింది

రాజకీయాలపై ఆసక్తి కలిగింది

విద్యార్థి దశలో ఉన్నప్పుడు తాను కాలేజీ ఎన్నికల్లో పోటీ చేస్తుండే వాడినని నవీన్ నిశ్చల్ చెప్పారు. క్రమంగా రాజకీయాల వైపు ఆసక్తి కలిగిందని, తమ దూరపు బంధువు 1989లో ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయనకు తామంతా మద్దతుగా నిలిచామన్నారు.

 రాజకీయాల్లో ఉంటే అలా అనుకోవద్దు

రాజకీయాల్లో ఉంటే అలా అనుకోవద్దు

రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లందరూ సంఘ వ్యతిరేకులనో, దూరమనో మనం అనుకోకూడదని నవీన్ అన్నారు. మంచి విజన్ ఉన్న వాళ్లు కూడా రాజకీయాల్లోకి రావొచ్చునని, తాను నేను రాజకీయాల్లోకి రావడం దైవ నిర్ణయమని తెలిపారు.

 మూడుసార్లు తక్కువ మెజార్టీతో ఓటమి

మూడుసార్లు తక్కువ మెజార్టీతో ఓటమి

కాగా, నవీన్ నిశ్చల్ 2004లో, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. టీడీపీ చేతిలో ఓడిపోయారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చేతిలో ఆరువేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. కాగా, నవీన్ నిశ్చల్ గత మూడు పర్యాయాలు స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయారు. 2004లో 7వేలకు పైగా, 2009లో 8 వేలకు పేగా, 2014లో ఆరువేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు.

English summary
YSR Congress Party Hindupur leader Naveen Nischal interesting comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X