YSRCP ఆస్తులు, ఆదాయం ఎంతో తెలుసా?

ఏపీలో అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆదాయం తగ్గింది. 13 శాతానికి పైగా ఆదాయం తగ్గినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. రాజకీయ పార్టీలు ఆ నివేదికనే స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. వైఎస్ఆర్ సీపీ సమర్పించిన నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.93.72 కోట్ల ఆదాయం రాగా, గతేడాది ఆదాయంతో పోలిస్తే సుమారు 13.21 శాతం తరుగు ఉన్నట్లు తేలింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో ఇంకా ఏమున్నాయంటే.. 2021లో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వైసీపీకి రూ.96.25 కోట్ల ఆదాయం రాగా, ఈ సారి రూ.60 కోట్లే వచ్చింది. ఎలక్టోరల్‌ ట్రస్టుల నుంచి వచ్చిన ఆదాయం అంతకుముందు ఏమీ లేకపోయినప్పటికీ ఈ ఏడాది రూ.20 కోట్లకు చేరింది. ఖర్చులన్నీ పోగా పార్టీకి నికరంగా రూ.92.72 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.250 కోట్ల ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌తో కలిపితే 2022 మార్చి 31నాటికి పార్టీ జనరల్‌ ఫండ్‌కు రూ.343 కోట్లు అయ్యింది.

ysr congress party income and property value

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదాయ లెక్కలు (అన్నీ రూపాయల్లో)

31 మార్చి, 2022

సంస్థల నుంచి డొనేషన్లు 2,68,245
ఎలక్టోరల్ ట్రస్టులు 20,00,00,000 -
ఇతర ఆదాయం 13,69,73,811
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 60,00,00,000
మొత్తం 93,72,42,056

ఖర్చులు 1,00,21,634
ఓపెనింగ్ బ్యాలెన్స్ 250,48,32,920
నికర ఆదాయం 92,72,20,422

31 మార్చి, 2021

సంస్థల నుంచి డొనేషన్లు - 30,881
ఎలక్టోరల్ ట్రస్టులు - 0
ఇతర ఆదాయం - 11,73,75,137
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా - 96,25,00,000
మొత్తం - 107,99,06,018

ఖర్చులు - 80,79,994
ఓపెనింగ్ బ్యాలెన్స్ - 143,30,06,896
నికర ఆదాయం - 107,18,26,024

జనరల్ ఫండ్‌లో మొత్తం (2022) : 343,20,53,342

వైసీపీ ఆస్తులు

నగదు 183,71,50,360
లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లు 159,48,08,150

జనరల్ ఫండ్‌లో మొత్తం (2021) : 250,48,32,920
నగదు - 250,34,45,540
లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లు - 18,08,100

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+