వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం అంటేనే కాల్ మనీ, అధికార పార్టీ అండతోనే సెక్స్ రాకెట్: అంబటి ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ అండదండలతోనే 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారం జరిగిందని ఆరోపించారు.

ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎంతటివారైనా వదలొద్దని డిమాండ్ చేశారు. ఎమ్మెలైనా, ఎమ్మెల్సీలైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. అయితే, వడ్డీ వ్యాపారం తప్పుకాదన్నారు. కానీ, వడ్డీ వ్యాపారం వేరు, కాల్ మనీ వ్యవహారం వేరని గుర్తించాలన్నారు.

విజయవాడలో వడ్డీ వ్యాపారం మితిమీరి పోయి మహిళలను చెరబట్టే స్థాయికి చేరడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అసమర్థపాలనతో రాష్ట్రంలో అరాచాకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు.

 YSR Congress Party leader Ambati Rambabu

'కాల్ మనీ'తో రాజకీయ నాయకులకు సంబంధం లేదన్న డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారహిమని విమర్శించారు.టీడీపీ ఎమ్మెల్సీ సోదరుడే అరెస్టైతే రాజకీయ నాయకులకు సంబంధం లేదని ఎలా చెబుతారని ఆయన నిలదీశారు.

‘సీఎం చంద్రబాబు అంటే కాల్ మనీ చంద్రబాబు' అని, ‘టిడిపి అంటే తెలుగు దుశ్శాసన పార్టీ' అని ఎద్దేవా చేశారు. విజయవాడ సీపీ సెలవు రద్దు చేసుకోవడాన్ని అంబటి స్వాగతించారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి సవాంగ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

English summary
YSR Congress Party leader Ambati Rambabu on Wednesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu in Call Money issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X