విభజన: జగన్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్ (పిక్చర్స్)

హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టేందుకు ఎమ్మెల్యేలు తెలుగు తల్లి విగ్రహం నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.

ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే తమను బలవంతంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను పోలీసులు గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

నీరు

నీరు

విభజన జరిగితే శ్రీశైలంకు నీళ్లు ఎక్కడ, నాగార్జున సాగర్‌కు నీళ్లేవి అంటూ హైదరాబాదులో నిరసన వ్యక్తం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.

అరెస్టు

అరెస్టు

సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల అరెస్టు

జగన్ పార్టీ కార్యకర్తల అరెస్ట్

జగన్ పార్టీ కార్యకర్తల అరెస్ట్

సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు.

టిడిపి

టిడిపి

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలనే ప్లకార్డును ప్రదర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు.

అరెస్టు దృశ్యం

అరెస్టు దృశ్యం

సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల అరెస్టు దృశ్యం

తెలుగు తల్లి విగ్రహం వద్ద

తెలుగు తల్లి విగ్రహం వద్ద

సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.

ఏం చేస్తారో చెప్పాలి: అశోక్ బాబు

కేబినెట్ నోట్‌ను కేంద్రమంత్రులు వ్యతిరేకిస్తారా లేక అందులో భాగస్వాములు అవుతారా తేల్చుకోవాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు శుక్రవారం అన్నారు. కేబినెట్ నోట్ వస్తే ఏం చేస్తారో కేంద్రమంత్రులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని పదమూడు జిల్లాల సీమాంధ్ర ప్రజలే కాకుండా తెలంగాణలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారన్నారు.

నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయకుంటే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో గల్లంతే అన్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వం ఈ రోజు తమను చర్చలకు పిలిచిందన్నారు. ఒక అంశంపై వివిధ రకాల వాదనలు వినిపించడం కాంగ్రెసు పార్టీకి అలవాటే అన్నారు. విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎంత విశ్వాసం ఉందో ఆపగలమని తమకు అంతే ధీమా ఉందన్నారు.

కెసిఆర్ రాజకీయ నాయకుడు అని, ఆయన వ్యాఖ్యలపై తాము స్పందించమన్నారు. కేబినెట్ నోట్ వస్తే సీమాంధ్ర ఎంపీలంతా రాజీనామా చేయాలన్నారు. కాగా, అంతకుముందు తపాలాశాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎపిఎన్జీవోలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+