దాసరి వ్యాఖ్యలపై భూమన: 'ఆ రోజూ ఇలాగే, జగన్‌కు నెటిజన్ల ఝలక్, తగ్గిన వైసిపి'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ధ్వజమెత్తారు. దాసరి నారాయణ రావు భౌతికకాయం వద్ద కూడా రాజకీయం చేయడం విడ్డూరం అన్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ధ్వజమెత్తారు. దాసరి నారాయణ రావు భౌతికకాయం వద్ద కూడా రాజకీయం చేయడం విడ్డూరం అన్నారు.
శవ రాజకీయాలు చేస్తున్న వైసిపి నాయకులు చివరకు పార్థివ దేహం వద్ద కూడా అదే ధోరణి కొనసాగించారని అన్నం సతీష్ ప్రభాకర్ విమర్శించారు.

దాసరి చెప్పారా?
గుంటూరులోని టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తానని దాసరి చెప్పారంటూ వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోవేనని అన్నారు.

విమర్శలు రావడంతో వైసిపి యూటర్న్
దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి అంటూ వారు మాటమార్చరని ఎద్దేవా చేశారు. వైసిపికి నెటిజన్లు షాకిచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.ఎవరు చనిపోయినా పార్టీలకు, కులాలకు అతీతంగా సంతాపం తెలపడం కనీస ధర్మమని, కానీ వైసిపి నాయకులు శవాల మీద చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. వైయస్ చనిపోయిన రోజు కూడా ఇదే ఇలాగే సీఎం కావడం కోసం జగన్ సంతకాలతో శవ రాజకీయాలు చేశారన్నారు. ప్రతి చోట ఇదే పంథా కొనసాగుతుందని, జగన్ వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

తల్లిపిల్ల కాంగ్రెస్ పోటీ
నవనిర్మాణ దీక్షపై పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. ప్రజలను మోసగించేందుకు తల్లీపిల్లా కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పార్టీ నేతలు తమ పంథా మార్చుకోకపోతే ప్రజలు తరిమి కొడతారని రవిచంద్ర అన్నారు.

లోకేష్‌కు జగన్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా
మహానాడు విజయవంతం కావడంతో ఏం చేయాలో తెలియక టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే బండారు అన్నారు. జగన్‌కు లోకేష్‌కు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగ వ్యాపారాలు చేసిన నీచ చరిత్ర జగన్‌ది అని, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసిన ఘనత లోకేష్‌ది అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications