వైఎస్ విగ్రహానికి నిప్పు: విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి

ఇదిలావుంటే, అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ విద్యార్థి నేతలు శనివారం ఉదయం యత్నించారు. నిజాం కాలేజి విద్యార్థులు, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు.
రెండోసారీ వాయిదా
శాసనసభ సమావేశాల్లో రెండోసారి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. మొదటి సారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఇరు ప్రాంతాల శాసనసభ్యులు నిరసన, నినాదాలకు దిగారు. సభ కొనసాగేలా సభ్యుల సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ పరిస్థితులో మార్పు లేకపోవడంతో సభను మరోసారి గంటపాటు వాయిదా వేశారు.
మొదటి సారి కేవలం నాలుగు నిమిషాలు, రెండో సారి ఒకటిన్న నిమిషం మాత్రమే సభ కొనసాగింది. శుక్రవారంనాడు కూడా శాసనసభా కార్యక్రమాలు సాగలేదు.












Click it and Unblock the Notifications