వైసీపీ ఏకైక జెడ్పీ పీఠం ఆమెకే - జగన్ ఏరి కోరి ఎంపిక..!!
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఒకటే జెడ్పీ పీఠం దక్కింది. రాష్ట్రంలోని మొత్తం 28 జెడ్పీ ఛైర్మన్ స్థానా ల్లో కూటమి 27 గెలుచుకుంది. వైసీపీకి అల్లూరి సీతారామ రాజు జిల్లా దక్కింది. కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా ఈ జిల్లా జెడ్పీ ఛైర్మన్ సీటు తొలుత జనసేనకు కేటాయించాలని భావించారు. కాగా, తుది ఫలితాల్లో ఈ స్థానం వైసీపీ గెలవటంతో.. ఇక్కడ కొత్త జెడ్పీ ఛైర్మన్ స్థానం పైన మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త జెడ్పీ ఛైర్ పర్సన్ పేరు ఏరి కోరి ఎంపిక చేసినట్లు పార్టీ నేతల సమాచారం.
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల ఫలితాల పైన ముఖ్య నేతలతో సమీక్ష చేసారు. వైసీపీ మున్సిపల్ కంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో బలం పెంచుకుంది. అనంతపురం కార్పోరేషన్ తో పాటుగా మూడు మున్సిపాల్టీలను గెలిచిన వైసీపీ... అల్లూరి సీతారామ రాజు జెడ్పీ పీఠం సొంతం చేసుకుంది. అనూహ్యంగా ఈ జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు గెలుపొందారు. కాగా, పార్టీ గెలిచిన ఈ జెడ్పీ సీటు యువ మహిళా నేతకు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం కొరబు అనూష పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ జిల్లాలో వైసీపీ మొత్తం 11 జెడ్పీటీసీల్లో వైసీపీ 7 స్థానాలు గెలుచుకుంది. తొలుత ఇక్కడ గెలిస్తే మాజీ ఎంపీ మాధవికి జెడ్పీ పీఠం కట్టబెట్టాలని భావించారు. అయితే, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాధవి ఓడిపోయారు. దీంతో, ఇక ఇప్పుడు అనూష పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ ముఖ్యులతో జగన్ సమీక్ష.. నిర్ణయం
అనూష చింతపల్లి నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు. గతంలో చింతపల్లి ఎంపీపీగానూ పని చేసిన అనుభవం ఉంది. విద్యా వంతురాలు కావటంతో పాటుగా పార్టీకి తొలి నుంచి విధేయు రాలిగా ఉన్నారు. అరకు ఎంపీ తనూజ బంధువు కావటం కూడా కలిసి వచ్చింది. తాజాగా చెన్నై లో జగన్ తో ఎంపీ తనూజ సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే ఈ జెడ్పీ సీటు ఖరారు పైన చర్చ జరిగిందని.. అనూష పేరు ఖరారైందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల పైన వైసీపీకి విజయం అందించిన ఈ జిల్లా ఇప్పుడు పార్టీకి కీలకంగా మారుతోంది. కాగా.. నూతన జెడ్పీ ఛైర్ పర్సన్ బాధ్యతల స్వీకరణకు వైసీపీ ముఖ్య నేతలు హాజరు కావాలని జగన్ సూచించారు. దీంతో, ఈ నెల 20న కొత్త జెడ్పీ ఛైర్ పర్సన్ గా అనూష ఎంపిక కావటం లాంఛనంగా మారుతోంది. ఈ నిర్ణయం పైన పార్టీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
