8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..? డెసిషన్ టైం, ఉత్కంఠ..!!

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ నిర్ణయం సంచలనంగా మారుబోతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందే జరిగే రాజ్యసభ ఎన్నికల లెక్కలు సీఎం జగన్..టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో, ఈ రోజు అసెంబ్లీ వేదికగా తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

స్పీకర్ విచారణ: టీడీపీ, వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను 12 గంటలకు విచారణకు హాజరు కావాలని, అలాగే తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.

YSRCP and TDP Rebel MLAs to attned before Speaker Tammineni today, may take Crucial decision

స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలిచ్చింది. వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయానికి కేటాయించింది. అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్నదానిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైసీపీ రెబెల్స్ స్పీకరుకు లేఖ రాశారు.

ఎమ్మెల్యేలు హాజరయ్యేనా: వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేలు మాత్రం నాలుగు వారాలు గ‌డువు కోరుతూ లేఖ‌లు పంపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం 60 రోజులు గడువు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఆరోగ్యం బాగోలేనందున నాలుగు వారాలు గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అయితే ఈ లేఖలపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ నెల 29 న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు పంపారు. వైసీపీ నుంచి ఆనం, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి టీడీపీలో చేరారు. అదే విధంగా టీడీపీ నుంచి వంశీ, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాల గిరిధ‌ర్, విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు.

YSRCP and TDP Rebel MLAs to attned before Speaker Tammineni today, may take Crucial decision

స్పీకర్ నిర్ణయం ఏంటి: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ఈ ఎమ్మెల్యేల అనర్హత పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ఎదుట హాజరవుతారని చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 2వ తేదీ వరకూ గడువు కావాలని కోరారు.

ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజ‌ర‌వుతారా.. లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక‌వేళ స్పీకర్ ఎదుట హాజరైతే ఎలాంటి వివరణ ఇస్తారు. వారి వివరణ పైన స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేస్తారా లేదా అన‌ర్హత వేటు వేస్తారా అనేది కీలకంగా మారుతోంది. అదే విధంగా ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+