మాజీ మంత్రి అనిల్ కు బిగిస్తున్న ఉచ్చు, కీలక పరిణామాలు..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు వరుస కేసుల్లో చిక్కకుంటున్నారు. అటు లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తో పాటుగా మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావన సంచలనంగా మారింది. ఇదే సమయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్నారు. ఇక, అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కు ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం.
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్.. రవాణా కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేసారు. కాగా, తనకు గోవర్ధన్ రెడ్డితో పాటుగా అనిల్ కుమార్ తో ఇదే వ్యాపారంలో ఉన్న సంబంధాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను, అనిల్ తో కలిసి కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను బహిర్గతం చేసినట్లు సమాచారం. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయల్లో మామూళ్ల వసూళ్లుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్వార్ట్జ్ కుంభకోణంలో కీలక వ్యవహారాలని శ్రీకాంత్‌రెడ్డి చెప్పటంతో ఆ దిశగా విచారణ కొనసాగుతోంది.

అనుమతులు లేకపోయిన టన్ను క్వార్ట్జ్‌కి రూ.7 వేల నుంచి రూ.10వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. క్వార్ట్జ్ అక్రమ సొమ్ముతో భారీగా భూములు కొనుగోలు చేసి వెంచ ర్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. గూడూరు, చెన్నూరు రోడ్డులో వంద ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అదే విధంగా నాయుడుపేట హైవే వెంట 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో రియల్ వెంచర్‌కి తెరదీశారు. హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపురి వద్ద హెవెన్లీ హోమ్స్ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే తుర్కయాంజల్ వద్ద గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో, ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ విషయంలో ఈ కేసులో ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications