షాకింగ్: 'బుట్టా రేణుకకు రూ.70 కోట్ల ప్యాకేజీ', బిజెపి భయం... అందుకే టిడిపిలో చేరలేదు
తమ పార్టీ గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏం ఆశించి టిడిపిలో చేరారో చెప్పాలని వైసిపి అధికార ప్రతినిధి పార్థసారథి మంగళవారం నిలదీశారు.
Recommended Video

అమరావతి: తమ పార్టీ గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏం ఆశించి టిడిపిలో చేరారో చెప్పాలని వైసిపి అధికార ప్రతినిధి పార్థసారథి మంగళవారం నిలదీశారు.
రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టిక్కెట్ ఇచ్చి రేణుకను జగన్, వైసిపి గెలిపించారన్నారు. బుట్టా రేణుక పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో టిడిపి సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని ప్రచారం సాగుతోందని సంచలన ఆరోపణ చేశారు.

ప్యాకేజీకి ఆశపడి టిడిపిలో చేరారా
ఆ ప్యాకేజీకి ఆశపడి బుట్టా రేణుక టిడిపిలో చేరారా? అని పార్థసారథి నిలదీశారు. నైతిక విలువలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. తన అవినీతి, చేతగానితనం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొనుగోళ్లు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.

జగన్ అన్నీ వివరిస్తారు
తమ పార్టీ అధినేత జగన్ నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నారని, తమ పార్టీపై మైండ్ గేమ్ కోసం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించారని ఆరోపించారు. ఈ పాదయాత్రలో టిడిపి సర్కార్ చేస్తున్న అవినీతి, మోసాలు, అక్రమాలు, ప్రజలు ఏవిధంగా అన్యాయానికి గురవుతున్నారో ఇవన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో ఈ ప్రక్రియను మొదలు పెట్టారని మండిపడ్డారు.

పశువులను కొంటున్నట్లుగా చంద్రబాబు కొంటున్నారు
పశువులను కొంటున్నట్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని ధ్వజమెత్తారు. సిగ్గులేకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జగన్ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారని, అందుకే శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేశాకే వైసిపిలోకి చేర్చుకున్నారని చెప్పారు.

బుట్టా రేణుక భయం అదేనా?
బుట్టా రేణుక అధికారికంగా టిడిపిలో చేరకపోవడానికి కారణాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు వైసిపి నాయకులు. రేణుక ఫిరాయించాలనుకున్నప్పటికీ ఆమె అధికారికంగా టిడిపిలో చేరకపోవడానికి అనర్హత వేటు కారణమని చెబుతున్నారు. ఇప్పటికే టిడిపిలో చేరిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వైసిపి న్యాయ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని బుట్టా రేణుక వ్యూహాత్మకంగా తన అనుచరులను పార్టీలో చేర్పించి, ఆమె మాత్రం అధికారికంగా చేరలేదని చెబుతున్నారు.

బుట్టా రేణుకకు బిజెపి భయం
ఇదిలా ఉండగా, వైసిపి ప్రజాప్రతినిధులను టిడిపి తీసుకోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇష్టం లేదు. అనర్హత వేటు విషయంలో ఏపీ స్పీకర్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ బుట్టా రేణుక ఎంపీ. కాబట్టి ఆమె టిడిపిలో చేరితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, లోకసభ స్పీకర్ ఎలా స్పందిస్తారో అనే భయం బుట్టా రేణుక, టిడిపిలో ఉందని, అందుకే ఆమె అధికారికంగా చేరలేదని అంటున్నారు.

హామీలు కూడా వచ్చాయని
చంద్రబాబును కలిసిన ఆమె అభివృద్ధి కోసమే తాను టిడిపి ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు ఎన్నికలకు అయ్యే ఖర్చును భరిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆమె టిడిపిలో చేరినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. ప్యాకేజీతో పాటు కాంట్రాక్టులు కూడా వస్తాయని చేరారని అంటున్నారు.












Click it and Unblock the Notifications