ఈ మూడు చోట్లా ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ

స్థానిక సంస్థల తరహాలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు అడ్డుకుంటోండటం పట్ల వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి తలెత్తడం పట్ల మండిపడుతోంది.

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఏమీ లేవు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ.. ఇక్కడా ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ పార్టీ అభ్యర్థులు ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని భావించిన వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలను బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ సంచలన ప్రకటన చేసింది.

YSRCP Boycotts Narasaraopet Gooty Guntakal Elections After Allegedly Police Miss Protection Promise

నామినేషన్ల దాఖలు ప్రక్రియలో పోటీ చేసే అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నామినేషన్ల సమయంలో పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చెప్పిన పోలీసులు ఆ మాట నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న మహిళా అభ్యర్థుల భద్రతను పణంగా పెట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లలేమని, అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన అన్నారు.

జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి
జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి

గడువు ముగిసే సమయానికి మాత్రమే పోలీసులు నామినేషన్ల కేంద్రాల వద్దకు వచ్చారని గోపిరెడ్డి విమర్శించారు. రెండు మండలాల్లో నామినేషన్లు వేసేందుకు అనుమతి కోరగా, రొంపిచర్లలో మాత్రమే అవకాశం కల్పించారని తెలిపారు. నామినేషన్ కేంద్రాల సమీపంలో సుమారు 2,000 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోహరించారని, దీంతో తమ పార్టీ అభ్యర్థులు లోపలికి వెళ్లలేక తీవ్ర భయాందోళనలకు గురయ్యారని గోపిరెడ్డి అన్నారు.

పోలీసులు చూస్తుండగానే అడ్డుకుంటోన్నారంటే.. !!
పోలీసులు చూస్తుండగానే అడ్డుకుంటోన్నారంటే.. !!

అటు అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు చోట్ల కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్లు వైసీపీ తెలిపింది. శాంతియుతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తామని పోలీసులు నమ్మించి, చివరి నిమిషంలో చేతులెత్తేశారని వైసీపీ పేర్కొంది. తమ అభ్యర్థులకు రక్షణ కల్పించకపోగా.. పరోక్షంగా టీడీపీ కూటమికి అనుకూలంగా వ్యవహరించారని మండిపడింది.

బంగారం ధరల్లో మరో మహా పతనం
బంగారం ధరల్లో మరో మహా పతనం

మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, యువనేత మంజునాథ్‌ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ఇక్కడ నామినేషన్ల ప్రక్రియకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని వైసీపీ చెబుతోంది. నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకోవడం, మహిళలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ప్రజాస్వామ్య విరుద్ధ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+