తల్లుల్ని కించపరిచేలా పట్టాభి కామెంట్స్-అందుకే వైసీపీలో అంత ఆగ్రహం-టీడీపీకి తీరని డ్యామేజ్
ఏపీలో రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎన్నడూ లేని విధంగా విపక్ష టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే ఇవి కాస్తా అదుపు తప్పడంతో ప్రత్యర్ధుల సెంటిమెంట్స్ కాస్తా హర్ట్ అవుతున్నాయి. తాజాగా టీడీపీ నేత పట్టాభి మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ తో పాటు డీజీపీ గౌతం సవాంగ్ తల్లుల్ని కించపరిచేలా ఉన్నాయి. అందుకే వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.

పట్టాభి వ్యాఖ్యల చిచ్చు
ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పడి ఈ డిసెంబర్ కు రెండున్నరేళ్లు పూర్తవుతాయి. ఈ రెండున్నరేళ్ల కాలంలో అధికార వైసీపీ విధానాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీతో పాటు పలు విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. వాటిని ప్రభుత్వం సంక్షేమంతోనే సమాధానం చెప్పింది. కానీ తాజాగా టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వ, పోలీసు పెద్దల్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా బోసడికే అంటూ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. హిందీ లేదా ఉర్దూలో ప్రత్యర్ధుల్ని తల్లులతో సహా దూషించేందుకు వాడే ఈ పద ప్రయోగాన్ని చేయడం ద్వారా కచ్చితంగా వైసీపీని రెచ్చగొట్టడమే లక్ష్యంగా పట్టాభి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.

బోసడికే ఎంత పెద్ద బూతో తెలుసా ?
టీడీపీ నేత పట్టాభి తన ప్రెస్ మీట్లో అలవోకగా వాడిన బోసడికే అనే పదానికి హిందీ లేదా ఉర్దూ, సంస్కృత భాషల్లో పచ్చి బూతు అర్ధం ఉంది. అదీ తల్లుల్ని కలుపుతూ సంబోధించేలా, ఇంకా చెప్పాలంటే తల్లుల్ని కించపరిచేలా ఈ పదం ఉంది. సభ్య సమాజంలో, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్ధులపై బురద జల్లే క్రమంలో లేదా తీవ్ర దూషణలకు దిగే క్రమంలోనూ ఏ పార్టీ కానీ, నేతలు కానీ బహిరంగంగా ఇప్పటివరకూ ఈ పద ప్రయోగం చేయలేదంటే నమ్మి తీరాల్సిందే. ఏపీ రాజకీయాల్ని దిగజార్చేలా, వ్యక్తిగతంగా సీఎం జగన్, డీజీపీ సవాంగ్ ను టార్గెట్ చేస్తూ పట్టాభి వాడిన ఈ పద ప్రయోగం సమప భవిష్యత్తులోనూ ఏ నేత కూడా మరోసారి వాడే ధైర్యం చేయకపోవచ్చు.

వైసీపీ కోపం వెనుక ..
టీడీపీ నేత పట్టాభి సమకాలీన రాజకీయాల్ని దిగజార్చేలా వాడిన ఈ ధర్డ్ గ్రేడ్ పద ప్రయోగం సహజంగానే వైసీపీ శ్రేణులకు, నేతలకు మంటపుట్టేలా చేసింది. అదీ తమ నేతపై ఇప్పటికే అయ్యనపాత్రుడు వంటి నేతలు చేసిన వ్యాఖ్యల చిచ్చు ఇంకా ఆరకముందే పట్టాభి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మరో చిచ్చు రేపినట్లయింది. దీంతో వైసీపీ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. జగన్ అభిమానుల్ని ఈ వ్యాఖ్యలు కంటగింపుగా మారిపోయాయి. అందుకే గంటల వ్యవధిలో వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసుల్ని టార్గెట్ చేయడం మొదలైంది. టీడీపీ ఆఫీసుల్లో జరిగిన దాడులపై సీఎం జగన్ కూడా తన అభిమానులకు బీపీ పెరిగినట్లు చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన సైతం వీటిపై ఎలా నొచ్చుకున్నారో అర్ధమవుతూనే ఉంది.

నొచ్చుకున్న జగన్ ?
వాస్తవానికి ఏపీలో టీడీపీ రాజకీయాల గురించి బాగా తెలిసిన సీఎం జగన్.. నిత్యం తనపై చేస్తున్న వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటూనే ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఇంకాస్త డోస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉంటే.. ఇప్పుడు పట్టాభి వ్యాఖ్యలు కూడా దీన్ని మరో హైట్ కు తీసుకెళ్లేలా ఉన్నాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ కూడా ఈ వ్యాఖ్యలు, అనంతర పరిణామాలపై స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే అభిమానులకు బీపీ పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
Recommended Video

గతంలో వైఎస్ ను తిట్టిన నోళ్లే...
గతంలో ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్, విపక్ష నేత చంద్రబాబు మధ్య ఆసక్తికర సంవాదాలు జరిగేవి. పలు సందర్భాల్లో హోరాహోరీ మాటల యుద్ధం కూడా సాగేది. ఇదే క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబును ఉద్దేశించి సీఎం వైఎస్సార్.. "చంద్రబాబూ నిన్ను కడిగేస్తాను. నీ తల్లి కడుపున ఎలా పుట్టానో అని బాఢపడతావు" అంటూ వ్యాఖ్యానించారు. మరుసటి రోజు పత్రికల్లో చంద్రబాబు తల్లిని కించపరిచిన సీఎం వైఎస్సార్ అంటూ వార్తలొచ్చాయి. దీంతో అప్పట్లో వైఎస్సార్ కూడా నొచ్చుకున్నారు. ప్రత్యర్ధుల్ని నేరుగా ఎదుర్కోవడమే తప్ప కించపరిచే వ్యాఖ్యలు చేయని వైఎస్ కూడా అప్పట్లో వీటిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నేరుగా బోసడికే అనే పదం వాడటం ద్వారా తల్లుల్ని నేరుగా కించపరిచిన పట్టాభి విషయంలో మాత్రం టీడీపీ రాజకీయాలు చూస్తుంటే గురివింద సామెతను కూడా మించిపోతున్నారనిపిస్తోంది.












Click it and Unblock the Notifications