మారుతున్న జగన్ లెక్కలు - ఢిల్లీ టు అమరావతి, కీలక నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య రాజకీయం గా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను రెండు వైపులా అమలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం పైన వైసీపీ మరో పోరుబాటకు సిద్దమైంది. యువత.. విద్యార్ధులకు మద్దతుగా మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో ఇటు అమరావతి కేంద్రంగా జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో మారుతున్న సమీకరణాలతో కొత్త లెక్కల తో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కోసం జగన్ అప్పాయింట్ మెంట్ కోరారు. వచ్చే వారం వారితో భేటీ ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం పైన జగన్ మరో పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఢిల్లీలో నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా యువత చేస్తున్న నిరసనలకు దేశ వ్యాప్తం గా మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని యువత- విద్యార్ధుల అంశాల పైన నిరసన లు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 28న అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నిరసన ప్రదర్శనల కు వైసీపీ పిలుపునిచ్చింది. యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు జరగనున్నాయి.

రఘురామ పై కొత్త అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్, అక్కడే అసలు ట్విస్ట్..!!
రఘురామ పై కొత్త అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్, అక్కడే అసలు ట్విస్ట్..!!
ysrcp-calls-statewide-protests-on-july-28-over-student-issues-ap-govt-unfulfilled-poll-promises

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాలు

DSCలో అక్రమాలు, నీట్ పేపర్ లీక్, నిరుద్యోగ భృతిపై నిరసనలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్ని పోలీసులతో అణచివేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు. అలాగే రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాల నేతలు ప్రకటించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం అమలు కాక చాలా చోట్ల విద్యార్ధులు కాలేజీల యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కోటి మందికి నెలకు 3వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ రెండేళ్లలో 72 వేల కోట్లు ఇవ్వకుండా బకాయిపెట్టారని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలకు కారణమైన వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే పట్టించకోవటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో, ప్రభత్వ తీరుకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహణకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+