మాచర్ల పరిణామాలపై అనిల్ సంచలన వ్యాఖ్యలు..!!

మాచర్లలో పిన్నెల్లి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చగా మారుతోంది. పోలింగ్ కేంద్రంలో పిన్నెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటం పైన పోలీసులు కేసు నమోదు చేసారు. లుకౌట్ నోటీసులు జారీ చేసారు. అటు ఈసీ ఈ ఘటన పైన సీరియస్ అయింది. మరోవైపు పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడులో టీడీపీకీ అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని..మిగిలిన విధ్వంసాల వీడియోలను బయట పెట్టాలని వైసీపీ ఎంపీ అభ్యర్ది అనిల్ డిమాండ్ చేసారు.

గతంలో లేని విధంగా
ఈ ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలో ఎక్కడా లేనంతగా దారుణాలు జరిగాయని మాజీ మంత్రి అనిల్ ఆరోపించారు. వైసీపీ నేతల ఫిర్యాదుల్ని జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదన్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి తన ఓటు వేసేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. పిన్నెల్లి సోదరుల్ని పోలింగ్ బూత్ ల వద్దకు రానివ్వలేదని చెప్పారు. చాలా చోట్ల రిగ్గింగ్ లు జరిగాయని ఆయా పోలింగ్ బూత్ లలోని ఫుటేజీలు కూడా బయటపెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేసారు.

YSRCP Candidate Anil Kumar Yadav Alleged police supports TDP cadre in Election time in Palnadu

కుమ్మక్కయ్యారు
పల్నాడులో ఎన్నికల సమయంలో కొందరు ఈసీ అధికారులు, పోలీసు అధికారులు అక్కడ టీడీపీతో కుమ్మక్కు అయ్యారని అనిల్ ఆరోపించారు. తొమ్మది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఈసీ ప్రకటించిన అంశాన్ని గుర్తు చేసారు. కానీ, కేవలం పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటక వచ్చిందని ప్రశ్నించారు. మిగిలిన వీడియోలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేసారు. పల్నాడులోని తుమ్రుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని చెప్పారు.

పోరాటం చేస్తాం
పల్నాడు జిల్లా మొత్తం కలియదిరిగిన ఎస్పీ, పాల్వాయిగేటు సహా మరో మూడు ప్రాంతాలకు రాలేదని, కావాలనే అక్కడ రిగ్గింగ్ కి అవకాశం కల్పించారని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేసారు. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. పోలీసులు కూడా టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారని, ఉద్దేశపూర్వకంగానే అల్లర్లకు అవకాశమిచ్చారని అనిల్ ఆరోపించారు. ఇప్పుడు కౌంటింగ్ కు సిద్దమవుతున్న వేళ పల్నాడులో చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+