కుప్పకూలిన జగన్ అభ్యర్థి, టిడిపి అభ్యర్థి గెస్టౌస్‌కి నిప్పు

 YSRCP candidate fainted
విజయవాడ//: నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు బుధవారం ఉదయం వస్తూ అస్వస్థతకు గురైన ఆయన కుప్పకూలిపోయారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

టిడిపి అభ్యర్థి అతిథి గృహంపై దాడి, నిప్పు

విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుంభా రవిబాబు అతిథి గృహం పైన కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. పెట్రోల్ పోసి అతిథి గృహానికి నిప్పంటించారు. అటు అరకు టిడిపి కార్యాలయం పైన దాడికి దిగారు. అయితే, తివేరి సోమ అనే వ్యక్తిని కాదని రవికి టికెట్ ఇచ్చినందుకే కార్యకర్తలు ఈ పని చేశారని అంటున్నారు. స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

తణుకులో...

భారతీయ జనతా పార్టీకి తాడేపల్లి గూడెం టిక్కెట్ ఎలా ఇస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తణుకులో నిరసనలు చేపట్టారు. తాడేపల్లి గూడెం టిక్కెటును తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, సీమాంధ్ర ప్రాంతంలో ఆయా పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

యువత ఓటు వేయాలి: జెపి

యువత తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సూచించారు. జెపి బుధవారం హైదరాబాద్ లోని రామంతాపూర్‌లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈల గుర్తుపై ఓటేసి లోక్‌సత్తా అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+