టీడీపీ అడ్డాలో వైసీపీ బంపర్ విక్టరీ

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర ఓటమిని మూట గట్టుకుంది. 151 ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. అయితే ఓటమిపై వైసీపీ ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కొందరు వైసీపీ నేతలు తమ గళం విప్పారు. వైసీపీ ఓడిపోవడంతో స్థానికంగా గెలిచిన నేతలు చాలామంది కూటమి ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు.దీంతో పలు చోట్ల ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

కడపతో పాటు ,తిరుపతి రూరల్, కాకినాడ రూరల్‌, పల్నాడు జిల్లా అచ్చంపేట.. సత్యసాయి జిల్లా రామగిరిలో ,జడ్పీ చైర్మన్‌ ఎంపీపీ,వైస్-ఎంపీపీ, ఉప సర్పంచ్ ఇలా పలు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఎన్నికలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంప్‌ రాజకీయాలకు తెరతీశాయి..దీనిలో భాగంగానే వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలో వైసీపీ సత్తా చాటింది. విజయపురం మండలం వైస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు.వైసీపీ అభ్యర్థి కన్నెమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

YSRCP candidate Kannemma unanimously elected as Vijayapuram Mandal Vice MPP

ఎన్నికల్లో ఎనిమిది మందికి గాను ఏడు మంది ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకోగా ఏడు మంది వైసీపీ అభ్యర్థిని బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కన్నెమ్మకు ధృవీకరణ పత్రాలను అందజేశారు.ఈ విజయంపై మాజీ మంత్రి రోజా స్పందించారు.వైసీపీ క్యాడర్ కలిసి కట్టుగా పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని రోజా పేర్కొన్నారు. కుటమి నేతల కుయుక్తులను తమ పార్టీ అభ్యర్థులు తిప్పి కొట్టారని రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రోజా ఆదేశాల మేరకు వైసీపీ నేత స్వామి రెడ్డి మండలంలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు అందరూ కూడా ఎన్నికైన కన్నెమ్మను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+