టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు కేంద్రం లోక్ సభ.. అసెంబ్లీ సీట్ల పెంపు పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీ.. ఎమ్మెల్యే స్థానాలు 50 శాతం మేర పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే కూటమి- వైసీపీ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 2024 లో ఓటమికి దారి తీసిన నిర్ణయాలను జగన్ దిద్దుబాటు మొదలు పెట్టారు. టీడీపీ కంచుకోటల్లో అభ్యర్ధులను ఖరారు చేస్తూ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా నివేదికలు సేకరిస్తున్నారు. 2029 నాటికి అసెంబ్లీ - లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో.. స్థానికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందస్తుగానే అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో సామాజిక లెక్కల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసారు. ఈ నిర్ణయం బూమ్ రాంగ్ అయింది. భారీ నష్టాన్ని మిగుల్చింది. దీంతో, ఎమ్మెల్యేలను 2019 లో గెలిచిన సొంత నియోజకవర్గాలకు తిరిగి కేటాయిస్తున్నారు. 2011 జనాభా లెక్కల మేరకే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో.. ఆ లెక్కల ఆధారంగా ముందస్తుగానే నేతలను పోటీకి సమాయత్తం చేసే విధంగా ప్రజల్లో ఉంచాలని డిసైడ్ అయ్యారు. తాజాగా రేపల్లె నియోజకవర్గం నుంచి కొత్త సమన్వయ కర్తను ఖరారు చేసారు.

రేపల్లెలో ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ ఒక్క సారి కూడా గెలవలేదు. కాంగ్రెస్ తరువాత టీడీపీకి నియోజకవర్గం కంచుకోటగా మారింది. వైసీపీ ఏర్పాటు నుంచి 2019 వేవ్ లోనూ టీడీపీ నే గెలిచింది. అక్కడ ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తోంది. 2024 ఎన్నికల ముందు అప్పటి వరకు ఇంఛార్జ్ గా ఉన్న నేత ను తప్పించి కొత్త వారికి సీటు ఇచ్చింది. తిరిగి టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ -గెలిచి మంత్రి అయ్యారు. దీంతో, వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే అక్కడ వైసీపీ కొత్త ఇంఛార్జ్ ను ప్రకటించింది. ఇక్కడ మోపిదేవి పార్టీకి 2024 వరకు పెద్ద దిక్కుగా ఉన్నారు. తరువాత ఆయన టీడీపీలో చేరారు. 2024 లో ఇక్కడ వైసీపీ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈపూరి గణేష్ ను గత ఎన్నికల్లో బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో గణేష్ ఓడిపోయారు. వరుస విజయాలతో టిడిపి బలం పెరగడంతో పాటు అనగాని సత్య ప్రసాద్ ను మంత్రి పదవి వరించింది. ఈ క్రమంలోనే గౌడ సామాజిక వర్గానికే చెందిన పీటా నాగ మోహన్ క్రిష్ణ వైపు మొగ్గు చూపింది.
నియోజకవర్గాల పునర్విభజన .. మారుతున్న లెక్కలు
నియోజకవర్గంలోని నగరం మండలం పీటా వారిపాలెం కు చెందిన మోహన్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్ధి కావడంతో పాటు గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వైపు మొగ్గినట్లు తెలుస్తుంది. గౌడ, మత్స్యకార సామాజిక వర్గాలతో పాటు కాపులు రేపల్లేలో అత్యధికంగా ఉంటారు. అయితే రానున్న ఎన్నికల నాటికి నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరిగితే రేపల్లే నియోజక వర్గంలో కూడా భారీగా మార్పులు ఖాయం. అయితే, రేపల్లే నియోజకవర్గం మాత్రం బిసిలకు పెట్టని కోటగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే - మంత్రి పైన స్థానికంగా ఉన్న అభిప్రాయానికి అనుగుణంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పైన స్పష్టత వచ్చిన తరువాత జగన్ తన కార్యాచరణ వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications