స్థానిక ఎన్నికల పై తేల్చి చెప్పిన జగన్, జరిగేది ఇదే..!!

మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలతో ప్రస్తుత రాజకీయాల పైన స్పందించిన జగన్.. త్వరలో జరిగే స్థానిక సంస్థల పైన దిశా నిర్దేశం చేసారు. ప్రభుత్వం పైన వ్యతిరేక ప్రతీ వర్గం లో కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. బల ప్రయోగం చేసి స్థానిక ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలు చేస్తారని.. యుద్దం చేయటంలో వెనుకడుగు వేయవద్దని జగన్ స్పష్టం చేసారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామా ల పైన స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు.

YSRCP Chief YS Jagan clear directions for party leaders to face local body Elections slams Chandra Babu decisions

ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదని చెప్పారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారని.. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని సూచించారు. వైసీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పారు. అందుకే తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని జగన్ ఆరోపించారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నారని.. గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడ్డారని విమర్శలు చేసారు.

 తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!
తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

రాజమండ్రిలో డాక్టర్‌ ప్రియాంకను దారుణంగా చంపారని ఆరోపించారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారని ఆవేదన వ్యక్తం చేసారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ వారు కుమ్మక్కై పని చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని.. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని చెప్పారు.

కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. అదే సమయంలో వైసీపీకి రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోందని వివరించారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని చెప్పిన జగన్.. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం అంటూ జగన్ ధీమా వ్యక్తం చేసారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని పార్టీ నేతలకు నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+